రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్..!!

గత రెండు నెలల నుండి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రైతులు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.దేశ రాజధాని ఢిల్లీలో చలిని మరియు వర్షాన్ని లెక్కచేయకుండా నిరసనలు చేపడుతూ ఉన్నారు.

 Center Bumper Offer For Farmers, Farmers Protests, Delhi, Suprem Court, Central-TeluguStop.com

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇప్పటికే తొమ్మిది సార్లు కేంద్ర పెద్దలు రైతు సంఘాలతో చర్చలు జరపగా.చాలా వరకు విఫలమవటం జరిగాయి.

ఈ పరిణామంతో కొత్త చట్టాల విషయంలో కేంద్రం వర్సెస్ రైతులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది.మరోపక్క ఆందోళనలు, నిరసనలు చేస్తున్న రైతులకు విపక్షాల నుంచి మద్దతు రోజురోజుకు పెరుగుతూ ఉంది.

రైతు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి మొట్టికాయలు వేసే రీతిలో సూచనలు ఇస్తూ ఉంది.దీంతో కేంద్రం ఓ మెట్టు దిగివచ్చి వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేస్తామని చెబుతున్నా గాని రైతులు ససేమిరా అంటున్నారు.

మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని పట్టుబడుతూ డిమాండ్ చేస్తున్నారు.ఇటువంటి తరుణంలో రైతు చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో ఏడాదిపాటు కొత్త రైతు చట్టాలను నిలిపివేయడానికి కేంద్రం రెడీ అయ్యింది.

మరి ఈ ప్రతిపాదనకు రైతులు ఏమంటారు అన్నది సస్పెన్స్ గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube