అమెరికాలో పెరుగుతున్న జనాభా: విదేశీ సంతతిలో భారతీయులదే హవా.. పదేళ్లలో భారీ వృద్ధి

అమెరికాలో జనాభా లెక్కలు పూర్తయ్యాయి.ఇందుకు సంబంధించిన వివరాలను యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసింది.గడిచిన పదేళ్లలో గతంలో ఏ దశాబ్ధంలోను నమోదు కాని స్థాయిలో అమెరికా జనాభా విస్ఫోటనం చెందింది.2010-2020 మధ్య కాలంలో అమెరికాలోని జనాభాను లెక్కించారు.తాజా గణాంకాల ప్రకారం అమెరికా జనాభా 33 కోట్లను దాటేసింది.2020 ఏప్రిల్ 1వ తేదీ నాటికి యూఎస్ జనాభా 33 కోట్ల 14 లక్షల 49 వేల 281 మంది.అమెరికాలోని 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలతో కలిపి ఈ జనాభా వున్నట్లు యూఎస్ సెన్సస్ వెల్లడించింది.గడిచిన దశాబ్ధ కాలంలో అమెరికాలో జనాభా 7.4 శాతం పెరిగినట్లు బ్యూరో ప్రకటించింది.

 Census Bureau Announced The Total Population Of The United States,  House Of Rep-TeluguStop.com

అమెరికాలోని ప్రతీ రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారంగానే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లను ఖరారు చేస్తారు.

ఈ జనాభా ఆధారంగానే రాష్ట్రాలకు ప్రభుత్వ పథకాలు, సహాయం అందుతుంటాయి.తాజా జనాభా లెక్కల ప్రకారం టెక్సాస్, కొలరాడో, ఫ్లోరిడా, మోంటానా, నార్త్ కరోలినా, ఒరెగాన్ రాష్ట్రాల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మిచిగాన్, న్యూయార్క్, ఒహియో, పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్థానాలు తగ్గనున్నాయి.

2019 నవంబర్ నాటి అమెరికన్ కమ్యూనిటీ సర్వే లెక్కల ప్రకారం.అమెరికా జనాభా మొత్తం 327 (32 కోట్ల 70 లక్షలు) మిలియన్లు.వీరిలో విదేశీ సంతతికి చెందినవారు 13.7 శాతం అంటే 44.7 మిలియన్లు.గడిచిన కొన్నేళ్లుగా అమెరికాలో విదేశీ సంతతి జనాభా 0.4 శాతం చొప్పున పెరుగుతోంది.2010 నాటికి అగ్రరాజ్యంలో విదేశీ సంతతి జనాభా 40 మిలియన్లు కాగా.2018 నాటికి అది 11.8 శాతం పెరిగింది.జులై 1, 2018 నాటికి వీరిలో భారతీయులు 2.5 మిలియన్లు (సుమారు 25 లక్షలు).2010 నాటితో పోలిస్తే భారత సంతతి 1.5 శాతం పెరిగింది.అమెరికాలోని మొత్తం విదేశీ సంతతిలో భారతీయుల శాతం 5.9.ఇది దేశ జనాభాలో 1 శాతం.2010-2018లో భారతీయుల సంఖ్య 8.7 లక్షలకు పెరిగింది.

1990వ దశకానికి పూర్వం అమెరికాలో భారతీయ సంతతి జనాభా కేవలం 4.5 లక్షల మంది మాత్రమే.ఇది 2018 నాటికి 489 శాతం పెరగడం గమనార్హం.2018కి 2.84 మిలియన్లతో చైనీయుల జనాభా 32 శాతం పెరిగింది.1990 తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో పలు విదేశీ సంస్థలు భారత్‌లో అడుగుపెట్టాయి.వీటిలో అమెరికన్ కంపెనీల పాత్ర అధికంగా వుండడంతో మానవ వనరుల బదలాయింపు పెద్ద ఎత్తున మొదలైంది.90వ దశకం నుంచి నేటి వరకు అమెరికాకు భారతీయ వలసలు పెరిగాయి.ఉద్యోగాలు, ఉన్నత విద్య, వ్యాపారాల కోసం అమెరికా బాట పట్టారు.ఈ కారణం చేతలనే అమెరికాలో భారతీయ సంతతి గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.

Telugu Representative, Illinois, Michigan, York, Ohio, Citizen India, Pennsylvan

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మొత్తం 1,24,99,395 మంది భారతీయులు వున్నట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించింది.అలాగే ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏ ప్రతిపాదనను పరిగణించడం లేదని లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చింది.మరోపక్క ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కోసం 2020లో 1,91,609 మంది విదేశీయులు దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది.

చదువులు, ఉద్యోగం, వ్యాపారం ఇలా కారణం ఏదైనా ప్రపంచ వ్యాప్తంగా వలసల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ డివిజన్, తాజాగా విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ 2020 హైలైట్స్‌’ నివేదిక, 2020లో 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్ళినట్లు వెల్లడించింది.భారత్‌ నుంచి వలస వెళ్ళిన అత్యధిక మందికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియాలు ఆశ్రయం కల్పిస్తోన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube