సాయి ధరమ్ తేజ్ చిత్రలహరికి క్లీన్ ఇమేజ్! డైరెక్టర్ ఫ్లేవర్ లోనే  

తేజ్ సినిమాకి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్. .

Censor Give Clean U Certificate For Chitralahari Movie-chitralahari Movie,clean U Certificate,director Kishore Tirumala,sai Dharam Tej,tollywood

  • మెగా హీరో సాయి తేజ్ హీరో గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా చిత్రలహరి. వరుసగా ఆరు కమర్షియల్ ఫ్లాప్ ల తర్వాత సాఫ్ట్ స్టొరీతో తన బాడీ లాంగ్వేజ్ కి ఏ మాత్రం సెట్ కాని కథనంతో నడిచే సినిమాతో తేజ్ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.

  • సాయి ధరమ్ తేజ్ చిత్రలహరికి క్లీన్ ఇమేజ్! డైరెక్టర్ ఫ్లేవర్ లోనే -Censor Give Clean U Certificate For Chitralahari Movie

  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ్ కి జోడీగా నివేతా పెతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి సాఫ్ట్ అండ్ నీట్ ప్రెజెంటేషన్ తో ఆకట్టుకుంది.

  • దురదృష్టం వెంట మోసుకొని వెళ్ళే ఒక వ్యక్తి జీవితంలో జరిగే కథగా చిత్రలహరి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల తన గత సినిమాల తరహాలోనే క్లాసికల్ గా ఆవిష్కరించాడు. ఇక ఇంద్యులో కమెడియన్ గా సునీల్ చాలా కాలం తర్వాత మంచి పాత్రలో కనిపించబోతున్నాడు.

  • ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ జరుపుకుంది. ఈ సినిమాకి సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది.

  • మెగా హీరో తేజ్ కెరియర్ లో క్లీన్ యూ సర్టిఫికేట్ తెచ్చుకున్న సినిమా ఇదే కావడం విశేషం. మరి ఈ సినిమా అతనికి ఎంత వరకు హిట్ ఇస్తుంది అనేది చూడాలి.