వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌కు బాగా కోతలు పడ్డట్లున్నాయిగా  

Censor Board Removes Scenes In World Famous Lover-review,ua Certificate,vijay Devarakonda,world Famous Lover

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రంను సెన్సార్‌ ముందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు తీసుకు వెళ్లారు.

Censor Board Removes Scenes In World Famous Lover-Review Ua Certificate Vijay Devarakonda Lover

ఈ చిత్రానికి ఖచ్చితంగా ఎ సర్టిఫికెట్‌ వస్తుందని అందరికి తెలుసు.ఎ ఇచ్చి కూడా కొన్ని సీన్స్‌ను పూర్తిగా తొలగించాల్సిందే అంటూ సెన్సార్‌ బోర్డు కండీషన్స్‌ పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్‌ల కాంబో సీన్స్‌ విషయంలో సెన్సార్‌ బోర్డు వారు అభ్యంతరాలు పెట్టినట్లుగా తెలుస్తోంది.ఆడవారిని అసభ్యంగా చూపించడంతో పాటు వారిని దూషించినట్లుగా ఉన్న సీన్స్‌ వల్ల భవిష్యత్తులో సమస్య వచ్చే అవకాశం ఉందని, ఆ డైలాగ్స్‌ మరియు ఒకటి రెండు సీన్స్‌ను కూడా మార్చాలంటూ సూచించిందట.

అలా మార్చితేనే సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇస్తామనే కండీషన్‌ పెట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కేఏఎస్‌ రామారావు నిర్మించిన ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్‌ కనిపించబోతున్నారు.మూడు విభిన్నమైన పాత్రల్లో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నాడు.ట్రిపుల్‌ రోల్‌ అయ్యి ఉంటుందా లేదా మరేదైనా మ్యాజిక్‌ చేశారా అనేది చూడాలి.

ఇక ఈ చిత్రంలో డైలాగ్స్‌ మనసుకు హత్తుకునేలా ఉంటాయంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో ఇలా సెన్సార్‌ కష్టాలు ఎదురవ్వడంతో యూనిట్‌ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

తాజా వార్తలు

Censor Board Removes Scenes In World Famous Lover-review,ua Certificate,vijay Devarakonda,world Famous Lover Related....