ఇదేందయ్యా ఇది: భూమిని చీల్చుకుని పైకొచ్చిన సిమెంట్ వరలు...!

మామూలుగా పట్టణాలలో అయితే ఇంటి ముందర సంపు అంటూ ఒక నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసుకుంటాం.ఈ మధ్య కాలంలో ఇలాగే పల్లెటూర్లలో కూడా సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రజలు.

 Earth, Scientist, Cement Varalu, People, Viral, Cement Boils,  Break,  Ground, R-TeluguStop.com

అయితే ఓ పల్లెటూర్లలో నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ సంపు నిర్మాణానికి గాను భూమి లోపలికి పంపించిన సిమెంట్ వరల వాటికి అవే బయటకు వచ్చేస్తున్నాయి.అవును మీరు విన్నది నిజమే.

ఎవరు తీయకుండా అంత బరువు ఉన్న అవి వాటంతట అవే బయటకు వస్తున్నాయి.అది కూడా చిన్న బరువు కలిగినవి కాదు.

ఏకంగా సరాసరి ఒక టన్ను బరువు ఉన్నాయి ఆ సిమెంట్ వరలు.భూమిలో నుంచి వాటంతట అవే పైకి రావడంతో జనం వాటిని చూడటానికి తండోప తండాలుగా వస్తున్నారు.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట గ్రామంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది.

ఆ ఊర్లో ని నాగరాజు అనే వ్యక్తి తన ఇంటికి భగీరథ మిషన్ పథకం కింద పంపు కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు.అయితే అందుకోసం ఏకంగా పది అడుగులకు పైగా ఒక గుంతను తవ్వి అందులో అడుగు ఎత్తు ఉన్న సిమెంట్ వరలను దించి ఏర్పాటు చేసుకున్నాడు.

అంతే కాదు పట్టుకున్న నీరు ఇంకి పోకుండా ఉండేందుకు సిమెంట్ తో కూడా ప్లాస్టరింగ్ చేయించారు.పది అడుగులు ఉన్న సంపు భూమి మీదకు కనపడకుండా పూర్తిగా భూమిలోనే నిర్మితం చేశారు.

అలాగే దానిని మూసేందుకు కూడా ఓ పెద్ద సిమెంట్ దిమ్మెను కూడా అమర్చారు.అయితే ఇది ఇలా ఉండగా గురువారం నాడు ఇంటి సభ్యులు అందరూ చూస్తుండగానే వారి కళ్ళ ఎదుటనే ఆ సిమెంట్ వరలు వాటంతట అవే భూమి నుంచి పైకి రావడం మొదలుపెట్టాయి.

ఇలా మొత్తం 10 వరలులో మొత్తం 6 వరలు వాటికి అవే పైకి వచ్చాయి.ఇలా ఏం జరుగుతుందో అర్థం కాని ఇంటి సభ్యులు ఆ విషయాన్ని వింత గా భావించి ఊర్లో వాళ్లకి చెబితే ఇక ఆ ప్రాంతం మొత్తం ప్రజలతో నిండిపోయింది.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా వినడంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఈ వింతను చూడటానికి ప్రజలు వస్తున్నారు.

అయితే ఈ విషయం సంబంధించి భూగర్భ శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఇకపోతే ఇది కేవలం భూగర్భంలో ఉండే నీటి ఒత్తిడి కారణంగానే ఇలా జరిగింది అంటూ తెలుపుతున్నారు.ఇలాంటి సంఘటనలు కేవలం చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తాయి అని అలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుందని తెలుపుతున్నారు.

ఈ విషయంలో మొత్తానికి భూమి పొరలో ఏర్పడే ఒత్తిడి కారణంగానే నీరు పైకి వస్తుందని ఆయన తెలిపారు.ఇక ఇలా ఒత్తిడి ఉన్న ప్రాంతాలలో ఇలా బరువైన వస్తువులను పెట్టినప్పుడు ఇలాగే జరుగుతుంది అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

ఇది పెద్ద వింతేమీ కాదని కేవలం అరుదుగా జరిగే సంఘటన అని అని తేల్చి చెప్పేశారు.ఈ విషయం ప్రజలకు కాస్త వింతగా అనిపించినా సైంటిఫిక్ గా మాత్రం చూస్తే ఇది చాలా అరుదైన సంఘటన మాత్రమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube