ముత్తయ్య మురళీధరన్.లెజెంటరీ స్పిన్నర్.
ఈయన మీద బయోపిక్ తీసుకున్నారు.ఇందులో నటించాల్సిందిగా విజయ్ సేతు పతికి ఆఫర్ వచ్చింది.
కానీ శ్రీలంక- LTTE మధ్య జరిగిన వివాదంలో ముత్తయ్య LTTEకి వ్యతిరేకంగా మాట్లాడాడు.ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ విజయ్ సేతుపతిని నెటిజన్లు టార్గెట్ చేస్తున్నార.
తమిళులకు వ్యతిరేకంగా మాట్లాడిన ముత్తయ్య బయోపిక్ లో ఎలా నటిస్తావు? అని అడుగుతున్నారు.ఈ నేపథ్యంలో తను సినిమా నుంచి తప్పుకున్నారు.
సేమ్ ఇలాగే డేట్లు కుదరక, స్టోరీ లేదంటే తమ రోల్ నచ్చక.పలు కారణాలతో పలు బయోపిక్ లలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు పలువురు నటీనటులు.ఇంతకీ వారు వదులుకున్న సినిమాలేంటి? ఆ నటులు ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
బాగ్ మిల్కా బాగ్- అక్షయ్ కుమార్
ఈ సినిమాలో మిల్కా సింగ్ క్యారెక్టర్ కోసం ముందుగా అక్షయ్ కుమార్ కు అవకాశం వచ్చింది.కానీ ఆయన డేట్లు కుదరక వదులుకున్నాడు.
మహానటి- నిత్యా మీనన్
ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ కోసం ముందుగా నిత్యామీనన్ ను అడిగారట.కానీ పలు కారణాలతో ఆమె ఓకే చెప్పలేదు.
మహానటి-సూర్య
ఈ సినిమాలో జెమిని గణేష్ క్యారెక్టర్ కోసం సూర్యను అడిగారు.కానీ ఆయనకు కుదరకపోవడంతో దుల్కర్ సల్మాన్ కు అవకాశం ఇచ్చారు.
మురళీధరన్- విజయ్ సేతుపతి
ఈ సినిమాలో విజయ్ సేతుపతికి నటించాలని ఆఫర్ వచ్చినా.తమిళ రాజకీయాల కారణంగా సినిమాను వదులుకున్నాడు.
సంజు- రణ్ వీర్ సింగ్
సంజయ్ దత్ బయోపిక్ సంజు సినిమాలో ముందుగా సంజయ్ క్యారెక్టర్ చేసేందుకు రణ్ వీర్ సింగ్ ను అడిగారు.ఆయన నో చెప్పడంతో రణ్ బీర్ కపూర్ చేశాడు.
సంజు- అక్షయ్ ఖన్నా
సునిల్ దత్ బయోపిక్ సంజులో నటించేందుక అక్షయ్ ఖన్నాను అడిగినా నో చెప్పాడు.
దంగల్- తాప్సీ, అక్షర హాసన్, దీక్ష సేత్
ఈ సినిమాలో పొగట్ సిస్టర్స్ క్యారెక్టర్ కోసం తాప్సీ, అక్షర హాసన్, దీక్ష సేత్ ను అడిగారు.కానీ అమిర్ సలహాతో వారిని మార్చారు.
పద్మావత్– షారుఖ్ ఖాన్, ప్రభాస్
ఈ సినిమాలో రతన్ సింగ్ క్యారెక్టర్ కోసం ముందుగా షారుఖ్ ఖాన్ ను అడిగారు.ఆయన నో చెప్పాడు.ఆ తర్వాత ప్రభాస్ ను సంప్రదించారు.తను కూడా పలు కారణాలతో రిజెక్ట్ చేశాడు.