సినీ పరిశ్రమతో పాటు టీవీ ఇండస్ట్రీలోని నటీ నటులపై నిత్యం ఏవేవో గాసిప్స్ వస్తూ ఉంటాయి.తమ తమ కో ఆర్టిస్టులతో, యాంకర్లతో, నటీనటులతో కాస్త చనువుగా ఉంటే చాలు.
ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే వార్తలు అల్లేస్తారు.వాళ్లు రిలేషన్ లో ఉన్నారట కదా అని డిస్కర్షన్స్ పెడతారు.
వందలకొద్ది రూమర్సు, అవసరానికి మించి గాసిప్స్ పుట్టిస్తారు.అంతేకాదు పలనా యాంకర్, ఆర్టిస్టు పెళ్లి చేసుకోబోతున్నారు.
ఆ హీరోయిన్, హీరో ఒకటవుతున్నారు.అనే దాకా ముచ్చట్లు వెళ్తున్నాయి.అలా రూమర్స్ వచ్చిన టీవీ- సినీ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రాహుల్ సిప్లిగంజ్- పునర్నవి
వీరిద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్ లో తెగ సందడి చేశారు.బయటకు వచ్చాక కూడా చెట్టాపట్టాల్ వేసుకుని తిరగారు.ఇద్దరు ప్రేమలో పడ్డారు.పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు వచ్చాయి.
యాంకర్ శ్రీముఖి- యాంకర్ రవి
వీరిద్దరు కలిసి పలు షోలు చేశారు.ఈ జంట మధ్య కూడా ఏదో ఉందనే గాసిప్స్ వచ్చాయి.
రష్మీ-సుధీర్
వీరి గురించి తెలియని వారుండరు. జబర్దస్త్ వేదిక మీద ఓ రేంజిలో సందడి చేస్తుంటారు.ఇద్దరు ప్రేమలో ఉన్నారని.
ఒక్కటి కాబోతున్నారని రూమర్స్ వచ్చాయి.అయినా వాటిని ఖండించారు రష్మి, సుధీర్.
వర్షిణి- హైపర్ ఆది
వీరిద్దరు కలిసి జబర్దస్త్ లో మస్తు సందడి చేశారు.వీరిద్దరి మధ్య కూడా ఏదో ఏదో ఉందని చర్చలు నడిచాయి.
వర్ష-ఇమ్మాన్యుయేల్
జబర్దస్త్ వేదిక మీద మరో జంట వర్ష-ఇమ్మాన్యుయేల్ తెగ సందడి చేస్తున్నారు.వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి.
శ్రీముఖి- ప్రదీప్
వీరిద్దరు కలిసి పలు టీవీ షోలు చేశారు.వీరిద్ద మధ్య కూడా ఏదో సంబంధం ఉందనే గాసిప్స్ వస్తున్నాయి.
విష్ణు ప్రియ- సుధీర్
వీరిద్దరు కలిసి పోవే పోరా షో చేశారు.ఈ ఇద్దరి మధ్యనా డ్యాష్ డ్యాష్ సంబంధం ఉందనే టాక్ వినిపించింది.
రాజ్ తరుణ్- హెబ్బా పటేల్
ఈ యంగ్ జంట పలు సినిమాలు చేసింది.దీంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.
కాజల్- బెల్లంకొండ శ్రీనివాస్
వీరిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు.ఈ సందర్భంలో కూడా ఇద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వెల్లువెత్తాయి.
అనిరుధ్- ఆండ్రియా
ఈ మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ మధ్య ప్రేమాయణం కొనసాగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అనుష్క-ప్రభాస్
వీరిద్దరు కలిసి మిర్చి, బాహుబలి లాంటి అద్భుత సినిమాల్లో చేశారు.ఈ సమయంలోనే వీరి మధ్య ప్రేమ నడుస్తుందని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి.