పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతున్న ప్రముఖులు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉండటంతో .

 Celebrities Want Pawan Kalyan To Recover Quickly-TeluguStop.com

ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టడంతో సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా నిండా చాలామంది ప్రముఖులతో పాటు అభిమానులు పవన్ కళ్యాణ్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

 

 Celebrities Want Pawan Kalyan To Recover Quickly-పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతున్న ప్రముఖులు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సునీల్ దియోధర్, డైరెక్టర్ మెహర్ రమేష్, దగ్గుబాటి పురందేశ్వరి, డైరెక్టర్ బాబీ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి నాయకుడు కె లక్ష్మణ్, శ్రీను వైట్ల, సంపత్ నంది, తిరుపతి ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మరికొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు రామ్ చరణ్, చిరంజీవి అదేవిధంగా వదిన సురేఖ తోపాటు ఉపాసన వాకబు చేస్తున్నారు.

అపోలో నుండి ప్రత్యేక వైద్య బృందం కూడా పవన్ కళ్యాణ్ కోసం పంపించడం జరిగింది.ఇదిలా ఉంటే తన ఆరోగ్యం అంతా బాగానే ఉందని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ప్రత్యేకంగా అభిమానులకు పవన్ తెలియజేయడం జరిగింది.

ప్రస్తుతం సోషల్ మీడియా నిండా అభిమానులు.పవన్ త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్థనలు చేస్తున్నారు.

#Chiranjeevi #Pawan Kalyan #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు