పోస్ట్ పొట్టి తప్పైపోయింది బాబు అంటూ లెంపలేసుకొని డిలేట్ చేసిన సెలబ్రిటీ ట్వీట్స్

సెల‌బ్రిటీల‌లో చాలా మంది సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు.కొంద‌రు ట్విట్ట‌ర్, మ‌రికొంద‌రు ఇన్‌స్టాగ్రామ్, మరికొంద‌రు ఫేస్‌బుక్‌లో త‌మ‌కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు.

 Celebrities Posted And Deleted Their Tweet After Realization, Tweets, Celebritie-TeluguStop.com

అయితే కొన్నిసార్లు వాళ్లు చేసిన పోస్టులు తీవ్ర దుమారాన్ని రేపేవిగా ఉంటున్నాయి.ఇప్ప‌టికే ప‌లువు సెల‌బ్రిటీలు ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు.

వాళ్లు చేసిన పోస్టులు విప‌రీతంగా ట్రోల్ కావ‌డంతో ప‌లువురు వాటిని డెలిట్ చేశారు కూడా.ఇంత‌కీ అంత‌లా దుమారం రేపిన సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా పోస్టులు ఏంటి? వాటిని ఎందుకు డెలిట్ చేశారో.ఇప్పుడు తెలుసుకుందాం!

1.సమంత ఇన్‌స్టా పోస్టు

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

అక్కినేని నాగార్జున కోడ‌లు, నాగ‌చైత‌న్య భార్య, ప్ర‌ముఖ హీరోయిన్ సమంత కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టా గ్రామ్‌లో చేసిన పోస్టుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది.దీంతో ఆమె వెంట‌నే ఆ పోస్టును తొల‌గించింది.అయినా దానిపై విప‌రీత‌మైన ట్రోలింగ్ కొన‌సాగింది.

ఇంత‌కీ త‌ను చేసిన పోస్టు ఏంటంటే.త‌న ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్రీత‌మ్ జుగ‌ల్క‌ర్ ఒడిలో కాళ్లు పెట్టి సోపాలో ప‌డుకున్న పిక్.

దానికి ఐ ల‌వ్ యు అంటూ రాసి ఇన్ స్టాలో పోస్టు చేసింది.దీనిపై నెటిజ‌న్ల నుంచి తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంది.

ప‌లువురు ఈ పోస్టును నాగార్జున‌కు ట్వీట్ చేశారు.పెళ్లైన అమ్మాయి.

మ‌రొక‌రితో ఇలా ఫోటో దిగి పెట్టొచ్చా అని విమ‌ర్శించారు.దీంతో నాగార్జున సైతం స‌మంత‌కు క్లాస్ తీసుకున్న‌ట్లు తెలిసింది.

దీంతో ఆమె ఆ పోస్టును డెలిట్ చేసింది.అయినా ట్రోలింగ్ ఆగ‌లేదు.

2.ఆర్జీవీ ట్వీట్

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

నేను మోనార్క్ అంటూ.ఎవ‌రి మాట విన‌ని ఆర్జీవీ కూడా త‌న ఓ ట్వీట్‌ను డెలిట్ చేసి వార్త‌ల్లో నిలిచాడు.స‌మంత‌పై ఆయ‌న చేసిన కామెంట్‌ను ఆ త‌ర్వాత తొల‌గించాడు.2019లో స‌మంత‌, నాగ‌చైత‌న్య హీరో, హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం మ‌జిలి.ఈ మూవీ ట్రైలర్ చూసి స‌మంత‌పై ఓ కామెంట్ చేశాడు ఆర్జీవి.

ఈ ట్రైల‌ర్‌లో స‌మంత కంటే నాగ‌చైత‌న్యే అందంగా క‌నిపిస్తున్నట్లు చెప్పాడు.అలాగ‌ని తాను గే కాద‌ని ట్వీట్ చేశాడు.

ఈ ట్రైల‌ర్‌లో స‌మంత అంత ఆక‌ర్ష‌ణ‌గా లేద‌నే ఉద్దేశంతో ఆయ‌న ఈ కామెంట్ చేశాడు.దీనికి నాగ చైత‌న్య రియాక్ట్ అయ్యాడు.

మనమంతా ఓ మంచి సినిమా చూడ‌బోతున్నాం అన్నాడు.అనంత‌రం ఎందుకో గానీ ఆర్జీవీ ఈ ట్వీట్ డెలిట్ చేశాడు.

3.త్రిష ఇన్‌స్టా పోస్టు

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

చెన్నై చిన్న‌ది త్రిష ఇన్ స్టాలో చేసిన పోస్టు తీవ్ర దుమారం చెల‌రేగ‌డంతో డెలిట్ కొట్టింది.కొంత కాలం క్రితం ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది.త‌న మాజీ ప్రియురాళ్ల‌ను స్నేహితుల‌గా కొన‌సాగించే వారంతా అహంకారులుగా మిగిలిపోతార‌ని రాసుకొచ్చింది.

త్రిష ఈ పోస్టును రానా గురించే చేసిందంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఆమె దాన్ని డెలిట్ చేసింది.రానా పెళ్లి నేప‌థ్యంలో త్రిష ఈ పోస్టు చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అయ్యింది.

4.లావ‌ణ్య త్రిపాఠి ట్వీట్

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

లావ‌ణ్య త్రిపాఠి కొద్ది రోజుల క్రితం లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్ల కామెంట్‌పై తీవ్రంగా స్పందించారు.స‌మాజంలో బ్రాహ్మ‌ణులకు ఉన్న‌త స్థానం ఉంద‌న్న ఆయ‌న‌.వారు స‌మాజ మార్గ‌ద‌ర్శ‌కులుగా ఉన్నార‌ని చెప్పాడు.

దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.ఉన్న‌త స్థానాల్లో ఉన్న వ్య‌క్తులు ఇలా మాట్లాడ కూడ‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి.

దీనిపై లావ‌ణ్య త్రిపాఠి సైతం స్పందించింది.తానూ ఆ కులానికే చెందినా.

ఇలా మాట్లాడ్డం స‌రికాద‌ని చెప్పింది.కొంద‌రు బ్ర‌హ్మ‌ణులు తాగు గొప్ప అని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియ‌డం లేద‌న్నారు.

కులంతో కాకుండా.చేసే ప‌నిలో గొప్ప‌త‌నం ఉండాల‌ని చెప్పింది.

ఆమె రియాక్ష‌న్ ను ప‌లువురు అభినందించారు.ఎందుకో కానీ ఆ త‌ర్వాత ఆ పోస్టును ఆమె డెలిట్ చేశారు.

5.ప‌రిణితి చోప్రా ఇన్‌స్టా పోస్టు

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

గోవా బీచ్‌లో తిరుగుతూ ఉన్న ఫోటోను ప‌రిణితి ఇన్ స్టాలో పోస్టు చేసింది.ఈ పోస్టు కాస్తా తీవ్ర ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు గురైంది.దీంతో ఆమె ఆ పోస్టును డెలిట్ చేసింది.

బీచ్‌లో దిగిన ఈ ఫోటోలో ఆమె అసిస్టెంట్ మూడు బ్యాగులు వేసుకోవ‌డంతో పాటు ఆమెకుగొడుగు ప‌ట్టి ఉన్నాడు.దీనిపై నెటిజ‌న్లు విరుచుకుప‌డ్డారు.

మూడు బ్యాగుల మోస్తున్న త‌న‌కు గొడుగు కూడా ప‌ట్టుకోమ‌ని చెప్పాలా? అని ప్ర‌శ్నించారు.కొంచెం కూడా జాలిలేద‌న్నారు.

అటు అసిస్టెంటును పెట్టుకునేదే ప‌నులు చేయించుకోవ‌డానికి అని మ‌రికొంద‌రు కామెంట్ చేశారు.దీంతో ఆమె ఆ పోస్టును డెలిట్ చేశారు.

6.సోనారిక ఇన్‌స్టా పోస్టు

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

హ‌ర‌హ‌ర మ‌హాదేవ్ పేర‌తో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ భ‌క్తి సీరియ‌ల్ లో పార్వ‌తీ దేవి క్యారెక్ట‌ర్ చేస్తుంది సోనారిక భ‌డోరియా.ఆమె కొద్ది రోజుల క్రితం విహార యాత్ర‌కు వెళ్లింది.అక్క‌డ బికినీలో ఫోటోలు దిగింది.

వాటిలో కొన్నింటిని ఇన్‌స్టాలో పోస్టు చేసింది.పార్వ‌తీ దేవి క్యారెక్ట‌ర్ చేస్తూ.

అర్థ‌న‌గ్నంగా రెచ్చిపోవ‌డం ఏంట‌ని ట్రోల్ చేశారు.ఆమె ఫోటో షూట్‌ల‌పైనా కామెంట్ చేశారు.దీంతో బాధ‌ప‌డిన ఆమె త‌న ఫోటోల‌ను డెలిట్ చేసింది.

7.నిఖిషా ప‌టేల్ ట్వీట్

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెష్ చెప్తూ నిఖిషా ప‌టేల్ ఓ ట్వీట్ చేసింది.అందులో హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్ కల్యాణ్‌కు బ‌దులుగా హ్యాపీ బ‌ర్త్ డే పావ‌లా క‌ల్యాణ్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.దీంతో ఆయ‌న అభిమానులు నిఖిషాపై దండెత్తారు.త‌ప్పును తెలుసుకున్న ఆమె.పోస్టు డెలిట్ చేసి.క్ష‌మాప‌ణ చెప్పింది.

8.క‌త్రినా ఇన్ స్టా పోస్టు

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

బాలీవుడ్ బ్యూటీ క‌త్రీనా కైఫ్.హీరో విక్కీ కౌష‌ల్‌తో డేటింగ్ చేస్తోంది.అయితే కొద్ది రోజుల క్రితం ఆమె సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది.

కొద్ది రోజుల క్రితం రెస్టారెంట్‌కు వెళ్లిన క‌త్రినా.ఓ ఫోటోను షేర్ చేసింది.అందులో ఫోటో తీసే వ్య‌క్తి విక్కీ.ఫోటోను జూమ్ చేయండి విక్కీ క‌నిపిస్తాడు అంటూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ న‌డిచింది.దీంతో ఆమె వెంట‌నే ఆ పోస్టు డెలిట్ చేసింది.

9.నాగ‌బాబు ట్వీట్

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

కొద్ది రోజుల క్రితం నాగ‌బాబు ఓ ట్వీట్ చేసి.ఆ త‌ర్వాత దాన్ని డెలిట్ చేశారు.క‌పిల్ దేవ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బ‌ర్త్ డే చెప్పాడు.అయితే క‌పిల్ దేవ్ ఫోటోకు బ‌దులుగా ఆయ‌న బ‌యోగ్ర‌ఫీలో న‌టించిన ర‌ణ్‌వీర్ ఫోటో షేర్ చేశాడు.దీంతో ట్రోల్‌కు గురైన నాగ‌బాబు వెంట‌నే ఆపోస్టును రిమూవ్ చేశాడు.

10.అంకిత ఇన్‌స్టా పోస్టు

Telugu Tweet, Celebs Tweets, Netizens Trolls, Trolls Samantha, Tweets-Telugu Sto

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత త‌న మాజీ ప్రియురాలు అంకిత చేసిన పోస్టు తీవ్ర దుమారం రేప‌డంతో ఆమె దాన్ని డెలిట్ చేసింది.ఎదుటి వారిని బాధ‌పెట్టిన వారిని దేవుడు భూమ్మీది నుంచి ఎలిమినేట్ చేస్తాడ‌ని ఆమె కామెంట్ చేసింది.దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆమె త‌న పోస్టును తొల‌గించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube