ఇండియన్ సెలబ్రెటీలని టార్గెట్ చేస్తున్న హ్యాకర్స్... ఇప్పుడు టబు కూడా

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి.టెక్నాలజీలో ఉన్న లూప్స్ ని అవకాశంగా వాడుకొని సైబర్ కేటుగాళ్లు రకరకాలుగా రెచ్చిపోతున్నారు.

 Celebrities Facing Hacking Problems, Tollywood, Bollywood, Celebrities, Actress-TeluguStop.com

సామాన్యులని టార్గెట్ చేస్తూ డబ్బులు దోచేస్తున్నారు.టెక్నాలజీ గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం ఫోన్ కి వచ్చే అలెర్ట్ మెసేజ్ లు నిజమని నమ్మేసి, అలాగే ప్రైజ్ మనీ ఆఫర్స్ కి ఆశపడి వేల రూపాయిల నుంచి లక్షల రూపాయిలు పోగొట్టుకుంటున్నారు.

ఒకసారి సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిన సొమ్ము మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది చాలా కష్టం.తెలియని వారిని ఈ విధంగా మోసం చేస్తే తెలిసిన వారిని మరో విధంగా బురిడీ కొట్టిస్తున్నారు.

వారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తూ వ్యక్తిగత సమాచారం దొంగిలించి బెదిరింపులకి పాల్పడుతున్నారు.ఇలాంటి హ్యాకర్స్ బారిన ఎక్కువగా సెలబ్రెటీలు చిక్కుకుంటున్నారు.

ఈ హ్యాకర్స్ ఒక్కో సారి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు.
.

గతంలో వ్యాపారవేత్తలు, క్రీడాకారులని టార్గెట్ చేసిన హ్యాకర్స్ ఇప్పుడు సినీ సెలబ్రెటీల మీద పడ్డారు.సెలబ్రెటీల ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్, ట్విట్టర్, యుట్యూబ్ అకౌంట్స్ ని హ్యాక్ చేసి తమ అధీనంలోకి తెచ్చుకొని వారికి నచ్చినట్లు చేస్తున్నారు.

సకాలంలో తమ అకౌంట్స్ హ్యాక్ అయినట్లు గుర్తిస్తే వెంటనె దానికి సంబందించిన అప్డేట్ ని సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్ కి చేరవేస్తున్నారు.కొంత మంది ఈ హ్యాకర్స్ వలన ఇబ్బంది పడుతున్నారు.

ఆ మధ్యకాలంలో పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని హ్యాక్ చేసి సమంత మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టారు.ఈ కామెంట్స్ చాలా దుమారం రేపాయి.

కొద్ది రోజుల క్రితం మంచు లక్ష్మి సోషల్ మీడియా అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారు.తాజాగా మంచు మనోజ్ వాట్స్ యాప్ ని ఎవరో హ్యాక్ చేశారు.

అలాగే హీరోయిన్ టబు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారు.ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది.

అందులో కనిపించే మెసేజ్ లు పట్టించుకోవద్దని పేర్కొంది.సెలబ్రెటీల ఇమేజ్ ని బ్యాడ్ చేసే ఉద్దేశ్యంతోనే ఇలా హ్యాకర్స్ వారిని టార్గెట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube