మార్చి 1 హోలీ రోజు నుంచి అదృష్టం కలిసి వచ్చే రాశులు     2018-02-16   21:14:57  IST  Raghu V

దేశంలో హోలీ పండుగను చిన్న,పెద్ద అనే తేడా లేకుండా చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 1 న వస్తుంది. ఈ పండుగను రంగులను ఒకరిపై జల్లుకొని ఆ రంగుల వలె తమ జీవితాలు కూడా రంగులమయం కావాలని కోరుకుంటారు. ఇక హోలీ పండుగ నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసొస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఏ రాశుల వారికి ఎలా కలిసి వస్తుందో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి అనుకున్న పనులన్నీ బాగా జరిగి ధన లాభం కలుగుతుంది. ఇచ్చిన అప్పు కూడా మార్చి తర్వాత వసూలు అయ్యిపోతుంది. మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి. జీవిత భాగస్వామితో మంచి జీవితాన్నిగడుపుతూ కుటుంబంతో హ్యాపీగా ఉంటారు. వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి.


వృషభ రాశి
ఈ రాశివారు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే మంచి సమయం. వీరు నిరంతరం కృషి చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. విద్యార్థులు బాగా చదువుతారు.

సింహ రాశి
ఈ రాశివారికి ఆర్ధికంగా చాలా బాగుంటుంది. వీరికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటే మంచిది. కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది.

తుల రాశి
ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. అభివృద్ధి చెంది మంచి ఫలితాలు అందుకుంటారు. వీరికి అనుకోకుండా ధనలాభం కలుగుతుంది.

మీనరాశి
వ్యాపారంలో ముందుకు వెళ్లడానికి స్నేహితుల అవసరం ఉంటుంది. కాని వ్యాపారంలో మంచి వృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.