కొత్త సంవత్సరానికి భారీగా మందుతో స్వాగతం పలికిన మందుబాబులు...

2020వ సంవత్సరం నూతన వేడుకల్లో భాగంగా హైదరాబాదులోని లిక్కర్ షాపులకు పండగ జరిగిందని చెప్పవచ్చు.కొత్త సంవత్సరం పేరుతో మందుబాబులు గతేడాది కంటే ఈ సంవత్సరం మరింత రెచ్చిపోయారు.

 Celabrations New Year Hyderabad-TeluguStop.com

 ఈ క్రమంలో ఏకంగా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని షాపులు మరియు బార్లు అన్ని షాపులు గణాంకాలను బట్టి చూస్తే ఏకంగా 380 కోట్ల రూపాయల విలువ గల మందుని మందుబాబులు సేవించినట్లు తెలుస్తోంది.సాధారణ రోజుల్లో అయితే రోజుకి 60కోట్ల రూపాయలకి మించి వ్యాపారం ఉండదని అలాంటిది ఒక్క  డిసెంబర్ 31వ తారీఖున మాత్రమే 380 కోట్ల రూపాయలు  వ్యాపారం జరిగినట్లు ఎక్సయిజ్ అధికారులు చెబుతున్నారు.

అయితే వీటితోపాటు ఉ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా బాగానే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.ఇందులో ముఖ్యంగా గా హైదరాబాద్ కమిషనర్ ప్రాంతంలో మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

వీటివల్ల కూడా ప్రభుత్వానికి కి చలనా రూపంలో బాగానే ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

Telugu Hyderabad, Liqueur, Liqueurshops-

అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు మాత్రం లిక్కర్ షాపులకు అర్ధరాత్రి వరకు అనుమతులు ఇచ్చి మద్యం సేవించిన వారిపై ఇలా చలానాలు విధించడం ఎంతవరకు న్యాయమని పోలీసులను పలువురు మందు బాబులు ప్రశ్నిస్తున్నారు.మరికొంతమంది ప్రజాసంఘాల నాయకులు మాత్రం ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందని అందువల్లనే కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఎక్కువ మంది మధ్య ప్రియులు మద్యంలో మునిగి తేలుతూ ఉంటారని దీంతో మరింత ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావించి వారికి లిక్కర్ షాపులకి అనుమతి ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనప్పటికీ కొత్త సంవత్సర వేడుకల్లో మాత్రం లిక్కర్ షాపుల వారు పండగ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube