ఫణి తుఫాన్ ప్రభావం తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

ఉత్తరాంధ్ర పై ఫణి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫణి తుఫాన్ కారణంగా శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను మినహాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

 Cec Taken Key Decision-TeluguStop.com

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ జిల్లా ల్లో ఎన్నికల కోడ్ ను మినహాయించాలి అని కోరుతూ ఈసీ కి లేఖ రాసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బాబు అభ్యర్థనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆయన రాసిన లేఖ పై సానుకూలంగా స్పందించని ఈసీ ఉత్తరాంధ్ర లోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.

విశాఖ,తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని,సహాయక చర్యలకు విఘాతం కలగకుండా కోడ్ ను మినహాయించాలని బాబు ఈసీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే బాబు లేఖ పై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను మినహాయించింది.ఈసీ తాజా నిర్ణయం తో అధికారులు అక్కడ మరిన్ని సహాయక చర్యలు చేపట్టారు.

ఎన్నికల కోడ్ ఉండడం తో ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించడం వీలు లేకపోతుండడం తో ఏపీ సి ఎం చంద్రబాబు ఈసీ కి లేఖ రాయడం తో కేంద్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చింది.ఈ సి నిర్ణయం పై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube