ఫణి తుఫాన్ ప్రభావం తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం  

Cec Taken Key Decision-chandrababu,election Commission,key Decision,letter,ఫణి తుఫాన్

ఉత్తరాంధ్ర పై ఫణి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫణి తుఫాన్ కారణంగా శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను మినహాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ జిల్లా ల్లో ఎన్నికల కోడ్ ను మినహాయించాలి అని కోరుతూ ఈసీ కి లేఖ రాసిన సంగతి తెలిసిందే..

ఫణి తుఫాన్ ప్రభావం తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం-CEC Taken Key Decision

ఈ నేపథ్యంలో బాబు అభ్యర్థనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన రాసిన లేఖ పై సానుకూలంగా స్పందించని ఈసీ ఉత్తరాంధ్ర లోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.విశాఖ,తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని,సహాయక చర్యలకు విఘాతం కలగకుండా కోడ్ ను మినహాయించాలని బాబు ఈసీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే బాబు లేఖ పై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను మినహాయించింది. ఈసీ తాజా నిర్ణయం తో అధికారులు అక్కడ మరిన్ని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్నికల కోడ్ ఉండడం తో ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించడం వీలు లేకపోతుండడం తో ఏపీ సి ఎం చంద్రబాబు ఈసీ కి లేఖ రాయడం తో కేంద్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చింది.

ఈ సి నిర్ణయం పై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.