మాస్క్ తప్పనిసరి : ఫౌచీ దెబ్బకు దిగొచ్చిన సిడీసి..బిడెన్ ఆదేశాలు వెనక్కి..!!

కరోనా సమయంలో ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే.రెండు వ్యాక్సిన్ డోసులు అయ్యిపోయాయి కదా మనకేం కాదంటూ విర్రవీగితే అమెరికా ప్రజలు ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలే ఉత్పన్నమవుతాయి.

 Cdc Suggested Mask Who Completed Two Dose Vaccination-TeluguStop.com

కరోనా వచ్చి తగ్గినా, లేదా రెండు వ్యాక్సిన్ లు వేసుకున్నా కరోనా రాదు అనే అపోహ నుంచీ పజలు బయటపడాల్సిందే.ఇందుకు అమెరికానే ఓ ఉదాహరణ.

అమెరికా అధ్యక్షుడు కొన్ని రోజుల క్రితం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో సమర్ధవంతంగా పూర్తి చేశాం ఇక మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదంటూ ప్రకటించారు.ఇదే విషయాన్ని.

 Cdc Suggested Mask Who Completed Two Dose Vaccination-మాస్క్ తప్పనిసరి : ఫౌచీ దెబ్బకు దిగొచ్చిన సిడీసి..బిడెన్ ఆదేశాలు వెనక్కి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడీసి) కుడా ద్రువీకరించింది.దాంతో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఎంతో మంది మాస్క్ పెట్టుకోకుండా రోజు వారి పనులు చేసుకోవడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే అమెరికాలో డెల్టా వేరియంట్ విరుచుకుపడుతోంది.రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కూడా డెల్టా ప్రభావం చూపడంతో పాటు రోజు రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ పరిస్థితిపై ఆందోళన చెందిన అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, కరోనా నివారణ సంస్థ ముఖ్య సలహాదారు ఆంటోని ఫౌచీ రెండు రోజుల క్రితం అమెరికా సిడీసి తీరును తప్పుబట్టారు.

Telugu America, Anthony Fouchi, Cdc Suggested Mask Who Completed Two Dose Vaccination, Delta Variant, Disease Control And Prevention, Joe Biden, Mask, Vaccine-Telugu NRI

వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా డెల్టా వేరియంట్ సోకుతోందని, ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవడంతో పాటు, మాస్క్ ధరించాలని కరోనా నియంత్రణకు ఇదే సరైన మార్గమని ప్రకటించారు.ఫౌచీ ప్రకనతో మేల్కొన్న సిడీసి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్క్ ధరించాల్సిందేనని తాజాగా ప్రకటించింది.

డెల్టా తీవ్ర స్థాయిలో విజ్రుంభిస్తున్న నేపధ్యంలో ప్రతీ ఒక్కరికి మాస్క్ అవసరమని సూచించింది.స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులు, చదువుకునే పిల్లలు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని ప్రకటించింది.

#Vaccine #Anthony Fouchi #America #Joe Biden #Delta Variant

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు