అమెరికాలో అద్దె ఇళ్ళలో ఉండే వారికి గుడ్ న్యూస్...!!!

కరోనా రక్కసి ఎంతో మంది జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యంపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో పడింది.

 Cdc Issues New Eviction Moratorium, Cdc, Rent Less People, No Job No Rent, Covid-TeluguStop.com

ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు.వ్యాపారాలు దెబ్బ తిన్నాయి.

భారీ ఫ్యాక్టరీలు సైతం మూసివేయబడ్డాయి.లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు.

జీతాలు లేక, దాచుకున్న డబ్బులు ఖర్చు అయ్యిపోతూ వారు పడ్డ భాదలు నేటికి వారిని భయాందోళనలకు గురిచేస్తూనే ఉన్నాయి.ఇక సొంత గూడు లేక అద్దెకు ఉండే వారి పరిస్థితి, వివిధ దేశాల నుంచీ వలసలు వచ్చి అద్దెలకు దిగిన వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

ఉన్న డబ్బు అద్దెలకు చెల్లించాలా లేక కడుపు నింపు కోవాలో తెలియని పరిస్థితి…దాంతో

యజమానుల ఇళ్ళను బలవంతంగా ఖాళీ చేయించడంతో అద్దెలు కట్టలేక పుట్ పాత్ లపై, చెట్ల కింద తల దాచుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.ఈ పరిస్థితులలో అమెరిక ప్రభుత్వం అద్దెకు ఉండే వారికి భద్రత ఇస్తూ మారటోరియం విధిస్తూ అప్పటి వరకూ అద్దెలు చెల్లించవలసిన అవసరం లేదని యజమానులు వారిపై ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశించింది.

అయితే ఈ నిభందన జులై వరకే పరిమితం చేసిన ప్రభుత్వం తాజాగా సవరణలు చేసింది.

Telugu America, Cdc Moratorium, Covid Pandemic, Delta, Moratorium, Job-Telugu NR

అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సిడీసి) అద్దె చెల్లింపుల విషయంలో నూతన మార్గ దర్శకాలు విడుదల చేసింది.జులై వరకూ ఉన్న ఈ నిభందనను అక్టోబర్ 3 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ ఏవిక్షన్ మారటోరియం నిభందన ప్రకారం దేశంలో ఎక్కువగా కరోనా కేసులు ఉన్న అన్ని ప్రాంతాల వారికి ఈ తాజా ఆదేశాలు అమలు అవుతాయని పేర్కొంది.

అమెరికాలో తాజా పరిస్థితుల దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సిడీసి ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube