చెత్త ఏరుకునే వ్యక్తికి ఒక కవర్‌ కనిపించింది, చూసి షాక్‌ అయ్యాడు.. సీసీటీవీ పుటేజ్‌తో దారుణం వెలుగులోకి వచ్చింది

అమెరికాలో ఒక రద్దీ ఏరియాలో ఒక చెత్త కుప్ప వద్దకు వచ్చిన ఒక వ్యక్తి అందులో ఉన్న ప్లాస్టిక్‌ లేదా తనకు ఏదైనా వస్తువు ఉపయోగ పడుతుందా అని వెదుకుతున్నాడు.అతడు చెత్త కుండీ వద్ద చాలా సమయం వెదికాడు.

 Cctv Footage-TeluguStop.com

తనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాడు.అంతలోనే అతడికి ఒక కవర్‌ కనిపించింది.

ఆ కవర్‌లో ఏముందో అని మొదట పట్టించుకోలేదు.మరోసారి ఆ కవర్‌ను పైకి లేపి చూడగా అందులో కదులుతున్న ఏవో ఉన్నాయి.

వెంటనే పక్కకు తీసుకు వెళ్లాడు.

అందులో చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి.

కవర్‌ లో చిన్న కుక్క పిల్లలు ఉండటంను గమనించిన ఆ వ్యక్తి వెంటనే జంతు సంరక్షణ ఆంబులెన్స్‌కు సమాచారం అందించాడు.అక్కడకు వచ్చిన ఆంబులెన్స్‌ వెంటనే ఆ చిన్న కుక్క పిల్లలను అక్కడ నుండి తీసుకు వెళ్లారు.

అదే సమయంలో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.కేసు నమోదు చేసిన పోలీసులు ఆ చెత్త కుప్ప వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు.

ఆ కుప్ప వద్ద కుక్క పిల్లలను ఎవరు వదిలేశారు అనే విషయం తెలుసుకున్నారు.ఆమెను గుర్తింరి ఆమె ఇంటికి వెళ్లారు.

పోలీసులకు ఆమె ఇంట్లో చాలా కుక్కలు కనిపించాయి.ఆమెను ప్రశ్నించిన పోలీసులు మరిన్ని షాకింగ్‌ విషయాలు తెలుసుకున్నారు.ఇప్పటి వరకు ఆమె 35 నుండి 30 వరకు కుక్క పిల్లలను బయట పడేసిందట.ఆ కుక్క పిల్లలు తమ ఇంట్లో ఎక్కువ అవ్వడం వల్లే తాను పడేసినట్లుగా ఆమె నిర్మొహమాటంగా ఒప్పుకుంది.

ఏదైనా జంతు సంరక్షణకు వాటిని అప్పగిస్తే వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.అందుకే వాటిని కవరులో పెట్టి చెత్త కుండీలో వేసినట్లుగా ఆమె ఒప్పుకుంది.ఆమె చేసిన పనికి స్థానికంగా ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.చిన్న కుక్క పిల్లలను అత్యంత వేడి ప్రదేశంలో, ఒక కవర్‌లో పెట్టి పడేయడం దారుణం అంటూ కేసు నమోదు చేయడం జరిగింది.

విచారణ జరుగుతున్న కేసుతో ఆమెకు కనీసం అయిదు నుండి పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్థానిక న్యాయవాదులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube