షర్మిల కేసు : అసభ్య కామెంట్స్ చేసిన మరో వ్యక్తి అరెస్ట్

సినీ హీరో ప్రభాస్ కు తనకు మధ్య సంబంధం ఉందంటూ… సోషల్ మీడియా తో పాటు యూట్యూబ్ లో అనేక తప్పుడు కథనాలు పోస్ట్ చేయడమే కాదు… ఆ పోస్టులకు అసభ్య కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ… వైసీపీ అధినేత జగన్ సోదరి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని గుంటూరులో అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీస్ లు ఇదే కేసులో …

 Ccs Police Arested Another Man Ys Sharmila Case1-TeluguStop.com

అడ్డురి నవీన్‌ అనే వ్యక్తిని సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మంచిర్యాల జిల్లా రామనగర్‌కు చెందిన నవీన్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్‌ షర్మిలను అప్రదిష్ట పాలుచేసేందుకు కుట్ర చేసిన కారణంగా అతనిపై సెక్షన్‌ 509 ఐపీఎస్‌, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు.సీసీఎస్‌ పోలీసులు నిందితుడిని హైదరాబాద్‌ తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube