"సిబిఎన్ ఒపీనియన్ పోల్" సంచలన కధనం..ఆందోళనలో రిపబ్లికన్ పార్టీ..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ప్రపంచం మొత్తం వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎవరోనని ఆత్రుగా ఎదురు చూస్తోంది.

 Cbn Survey On Us Presidental Elections, Us, President Donald Trump, Republic Par-TeluguStop.com

మళ్ళీ అధికారాన్ని చేపట్టబోయేది ఎవరూ అనేది ప్రస్తుతానికి ఊహాజనితమే అయినా కరోనా కారణంగా ట్రంప్ ఓటమి చెందటం ఖాయమని పలు సర్వేలు సైతం నొక్కి వక్కాణిస్తున్నాయి.అయితే మళ్ళీ అధికారం చెప్పడం ఖాయమని, రెండవ సారి కూడా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారని రిపబ్లికన్ పార్టీ ఎంతో బలంగా చెప్తోంది.

అమెరికన్స్ సంక్షేమం కోసం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ట్రంప్ ని విజయం వైపుగా నడిపిస్తాయని అంటున్నారు.అయితే తాజాగా రిపబ్లికన్ పార్టీని ఆందోళనలోకి నెట్టేసే ఓ సంచలన కధనాన్ని సిబిఎన్ న్యూస్ వెల్లడించింది.

అమెరికాలో అత్యంత కీలక రాష్ట్రాలైన విస్కాన్సిస్, పెన్సిల్వేనియా లలో ట్రంప్ తన ప్రత్యర్ధి జో బిడెన్ కంటే వెనుకంజలో ఉన్నారని తెలిపింది.బిడెన్ ట్రంప్ కంటే సుమారు 6 పాయింట్స్ ముందంజలో ఉన్నారని సిబిఎన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ తేలింది.

గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కి ఈ రెండు రాష్ట్రాలు అత్యధిక మెజారిటీ రాష్ట్రాలుగా ఉండగా తాజాగా బిడెన్ ఈ రెండు రాష్ట్రాల్లో ముందజంలో ఉండటం రిపబ్లికన్ పార్టీని కలవరపెడుతోంది.ఇదిలాఉంటే

సిబిఎన్ సర్వే ప్రకారం ట్రంప్ కి అమెరికాలో ఎలాంటి మద్దతు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదంటూ ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీపై ఎదురు దాడి మొదలు పెట్టింది.

కాగా కరోనాని కట్టడి చేయడంలో ట్రంప్ వైఫల్యం చెందటం వలనే ప్రజలు ట్రంప్ పై వ్యతిరేక భావంతో ఉన్నారని, బిడెన్ ట్రంప్ స్థానంలో ఉండిఉంటే కరోనా ని కంట్రోల్ చేయడంలో సమర్ధవంతగా వ్యవహిరించే వాడని స్థానిక ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా సిబిఎన్ న్యూస్ తెలిపింది.అయితే ప్రస్తుత పరిస్థితులు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మారే అవకాశాలు లేకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube