టీడీపీలో వారసులకి సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చిన చంద్రబాబు!  

టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్ధులుగా వారసులకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు. .

  • టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న సాయంత్రం మొదటి జాబితా ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించాడు. ఇప్పటికే ఎంపీగా బరిలో నిలబడే అభ్యర్ధులని దాదాపు ఖారారు చేసిన బాబు, తాజాగా ఎమ్మెల్యే అభ్యర్ధులని కూడా ఖరారు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సారి కూడా బాబు తన అభ్యర్ధుల లిస్టు లో చాలా వరకు సిట్టింగ్ లకు పెద్ద పీట వేసాడు. ఒకటి, రెండు నియోజకవర్గాల మినహా అభ్యర్ధులని దాదాపు ఉన్న వారినే ఖరారు చేసారు.

  • ఇదిలా ఉంటే మరో వైపు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ సారి ఎన్నికలకి దూరం అవుతామని ప్రకటించడంతో వారి స్థానంని వారి వారసులకి ఇచ్చారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వారసులకి కూడా మరో నియోజక వర్గం కేటాయించి పెద్ద పీట వేసారు. తాజాగా ఎన్నికల బరిలో టీడీపీ తరుపున బరిలో నిలుస్తున్న వారసులు చూసుకుంటే పరిటాల శ్రీరామ్, దేవినేని అవినాష్, గౌతు శిరీష, అలాగే జేసీ పవన్ రెడ్డి, కేఈ శ్యాంబాబులు, కిడారి శ్రావణ్ కూడా ఉన్నారు. మరి వీరు తండ్రి వారసత్వాన్ని ఎంత వరకు నిలబెడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.