టీడీపీ ఆఫర్ ని తిరష్కరించిన ముద్రగడ! అయిన పట్టు వదలని చంద్రబాబు  

టీడీపీలో చేరడానికి కాపు ఉద్యమ నేత ముద్రగడకి బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు. .

  • ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్నాడు. ఎలా అయిన గెలుపే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న బాబు కులాల ఓటు బ్యాంకు మీద కూడా ద్రుష్టి పెట్టాడు. ముఖ్యంగా తెలుగు దేశంకి మొదటి నుంచి బలంగా ఉన్న కాపు ఓటు బ్యాంకు ఈ సారి జనసేన పార్టీ వైపు ఉండటంతో ఎలా అయిన జనసేన నుంచి తనకి ఉన్న నెగిటివ్ ఓటు బ్యాంకుని తగ్గించుకొని గెలుపు అవకాశాలు సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాపుల ఓటు బ్యాంకు కోసం వంగవీటి రాధని పార్టీలో చేర్చుకున్నాడు. దీని కోసం తన నాయకులతో పని కాకపోవడంతో లగడపాటిని కూడా రంగంలోకి దించాడని సమాచారం.

  • ఇదిలా ఉంటే తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంని కూడా టీడీపీలో చేర్చుకోవాలని కొత్త ఎత్తుగడకి తెరతీసారు. పార్టీకి చెందిన కాపు వర్గానికి చెందిన ఓ కీలక నేతని బాబు ముద్రగడ దగ్గరకి పంపించి తన కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేయడంతో పాటు, పార్టీలో సముచిత స్థానం ఇస్తామని, అలాగే ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది. అయితే చంద్రబాబు గురించి తెలిసిన ముద్రగడ ఆ ఆఫర్ ని తిరష్కరించినట్లు సమాచారం. అయిన కూడా బాబు పట్టు వదలకుండా ముద్రగడని ఒప్పించి పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంకుని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ బేటీలో కాపు జేఏసీ నాయకులు కూడా పాల్గొన్నారని తెలుస్తుంది.