ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue court )లో విచారణ జరిగింది.

ఈ క్రమంలో సీబీఐ( CBI ) సమాధానం తమకు అందలేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అటు శనివారమే కవితను ప్రశ్నించినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.

కవితను ప్రశ్నించే అంశంపై ఎటువంటి రిప్లై ఫైల్ చేయడం లేదని సీబీఐ కోర్టుకు వెల్లడించింది.ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే విచారణకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత ( MLC Kavitha )తరపు న్యాయవాది కోర్టును కోరగా తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు