సుశాంత్ కేసులో ట్విస్ట్ ఇచ్చిన రియా పొరుగింటి మహిళ!

దాదాపు నాలుగు నెలల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.సుశాంత్ మృతి తరువాత విచారణలో ఈ కేసులో డ్రగ్స్ గురించి వెలుగులోకి రావడంతో పాటు సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడేవాడని అతని గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 Cbi Warns Rhea Chakraborty Neighbour, Rhea Chakraborty, Sushanth Death, Neighbou-TeluguStop.com

సీబీఐ అధికారులు, ఎన్సీబీ అధికారులు సుశాంత్ మృతితో, డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న రియాను ఈ కేసులో అరెస్ట్ చేయగా మూడు రోజుల క్రితం ఆమె బెయిల్ పై విడుదలైంది.

అయితే తాజాగా సుశాంత్ మృతి కేసులో రియా పొరుగింటి మహిళ ఊహించని ట్విస్ట్ చేశారు.

గతంలో రియాకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన పొరుగింటి మహిళ ప్రస్తుతం రియాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.గతంలో ఆ మహిళ సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు అతడు రియాను బైక్ పై ఇంటి దగ్గర డ్రాప్ చేశాడని పొరుగింటి మహిళ వెల్లడించింది.

అయితే తాజాగా అధికారుల ముందు మాత్రం ఆమె మాట మార్చింది.
సీబీఐ సుశాంత్ రియాను డ్రాప్ చేసినట్టు స్టేట్ మెంట్ ఇవ్వాలని మహిళను కోరగా ఆమె అందుకు అంగీకరించలేదు.

గతంలో సుశాంత్ రియాను డ్రాప్ చేసినట్టు చెప్పిన ఆమె తాను అలా చెప్పలేదని సీబీఐ ఎదుట చెప్పడం గమనార్హం.దీంతో సీబీఐ అధికారులు ఆ మహిళపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

దీంతో రియా తరపు న్యాయవాది రియాపై మీడియా ముందు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటనలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోర్టును కోరడం గమనార్హం.

మరోవైపు సుశాంత్ మృతి చెందిన తరువాత అతని కుటుంబ సభ్యులు సుశాంత్ ను ఎవరో హత్య చేశారని ఆరోపణలు చేయగా ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తేల్చారు.

సుశాంత్ డబ్బులు రియా బ్యాంక్ ఖాతాలలోకి జమైనట్లు సుశాంత్ తండ్రి చేసిన ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు చేసింది.సుశాంత్ అభిమానులు మాత్రం డ్రగ్స్ వల్ల సుశాంత్ మృతి కేసు పక్కదారి పడుతోందని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube