పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరపాలి.. గవర్నర్ కు టీడీపీ నేతల వినతి

విజయవాడ: గవర్నర్ తో ముగిసిన టీడీపీ నేతల భేటీ.పాల్గొన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇతర టీడీపీ నేతలు.

 Cbi Should Probe Attacks On Party Offices Tdp Leaders Request Governor, Cbi, Sho-TeluguStop.com

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దతి ప్రకారం టీడీపీ ని అణిచివేయాలని చూస్తున్నారు.

ఆర్థిక మూలాల దెబ్బ తీసి నాయకులను ఇబ్బంది పెట్టారు.టీడీపీ ని నాశనం చేయాలని అన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తలు రక్షించుకున్నారు.

ప్రభుత్వానికి పిచ్చి ముదిరిపాకాన పడింది.దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు.

కార్యకర్తలు చెమటోడ్చి కట్టిన దేవాలయం పై దాడి చేశారు.రాష్ట్రం మాదక ద్రవ్యాలకు, గంజాయి కి హబ్ గా దొరికింది.ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులు కూడా ఇదే చెప్తున్నారు.దేశంలోనే ముఖ్యమంత్రి పై, ఎమ్మెల్యే లపై ఆగ్రహం ఉన్న రాష్ట్రం ఏపీ.కేంద్రానికి నివేదిక ఇచ్చి ఆర్టికల్ 356 ను వెంటనే విధించాలని గవర్నర్ ను కోరాము.రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరపాలని ఆడిగాము.

రిపోర్ట్ తెప్పించుకుని కేంద్రానికి, రాష్ట్రపతికి పంపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు.కేంద్ర హోమ్ మంత్రి, ప్రధాని, రాష్ట్రపతి ని కూడా కలుస్తాం.గంజాయి, హెరాయిన్ తో యువత జీవితాలతో ఆడుకుంటున్నారు.పోలీసులతో కలిసి పార్టీ కార్యాలయంపై దాడులు చేశారు.

ఎస్కార్ట్ ఇచ్చి మరీ రౌడీలను పార్టీ ఆఫీస్ కి పంపించారు.దాడి ఘటనను విడిచి పెట్టె ప్రసక్తే లేదు.

దేశంలోని అన్ని పార్టీలకు ఈ డాడీ విషయం తెలియాలి.డీజీపీ దద్దమ్మ కాకపోతే ఒక్కరినైనా ఎందుకు పట్టుకోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube