టిడిపి నేత రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు

సీనియర్ రాజకీయ నాయకుడుగా మాజీ ఎంపీ గా గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రాయపాటి సాంబశివ రావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.అయితే ఈ రోజు అకస్మాత్తుగా ఆయన ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది.

 Cbi Rides On Ex Mp Rayapati Sabasiva Rao House-TeluguStop.com

రాయపాటిని చెందిన ఆస్తులు ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఉండడంతో ఏకకాలంలో అన్ని చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు 300 కోట్ల రూపాయలను రాయపాటి తీసుకున్నారని, వాటిని కట్టకుండా బ్యాంకును మోసం చేసినట్లుగా ఆయన పై ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.అలాగే ఇప్పటికే సిబిఐ దీనిపై కేసు కూడా నమోదు చేసింది.హైదరాబాదులోని కావూరి హిల్స్ లో ట్రాన్స్ ట్రాయ్ కార్యాలయం ఉండగా, గతంలో ఈ కంపెనీ పోలవరం ప్రాజెక్టు పనులను కూడా చేపట్టింది.ప్రస్తుతం ఈ సోదాలపై రాజకీయ వర్గాలను ఆసక్తి నెలకొంది.

రాయపాటి ఇంటిపైనే కాకుండా ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లోనూ అధికారుల సోదాలు చేస్తున్నారు.సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube