వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దూకుడు పెంచిన సీబీఐ..!!

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.తన తండ్రి హత్య కేసు విషయంలో ఇప్పటివరకు ఏమీ తేల్చలేక పోయారు ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న మాకే ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Cbi Raises Aggression In Ys Vivekananda Reddy Murder Case-TeluguStop.com

ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే తాజాగా సిబిఐ బృందం దూకుడు పెంచింది.ఇటీవల సిబిఐ అధికారులు మళ్లీ కడపకు రావడం జరిగింది.

ఈ నేపథ్యంలో మరోసారి ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను విచారించడానికి సిబిఐ అధికారులు రెడీ అయ్యారు.ఈ కేసుకు సంబంధించి రాజకీయ కుట్ర ఉందని ఇప్పటికే డాక్టర్ సునీత రెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది.

 Cbi Raises Aggression In Ys Vivekananda Reddy Murder Case-వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దూకుడు పెంచిన సీబీఐ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పార్టీల రాజకీయ నేతలు ఈ హత్య కేసుకు సంబంధించి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు.ముఖ్యంగా వైసీపీ మరియు టిడిపి పార్టీకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఇలాంటి తరుణంలో సీబీఐ రంగంలోకి దిగి మరోసారి ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను విచారించడానికి రెడీ అవ్వడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 

.

#YSVivekananda #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు