నీరవ్ మోడీ అరెస్ట్ కి రంగం! లండన్ హై కోర్ట్ అరెస్ట్ వారెంట్

పంజాబ్ నేషనల్ బ్యాంకు కి వేల కోట్ల బకాయిలు పెట్టి మోసం చేసిన డిమాండ్ వ్యాపారి నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయి లండన్ లో తలదాచుకున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే నీరవ్ మోడీ ఈ మధ్య లండన్ వీధుల్లో షికారు చేస్తూ టెలిగ్రాఫ్ జర్నలిస్ట్ కి చిక్కాడు.

 Cbi Plan To Arrest Nirav Modi In London-TeluguStop.com

అతను వీడియో తీయడంతో కొత్త లుక్ లో ఉన్న నీరవ్ ఆచూకి ఇండియాకి తెలిసిందే.నీరవ్ మోడీ లండన్ లో మళ్ళీ కొత్తగా డిమాండ్ బిజినెస్ స్టార్ట్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఇండియాలో నీరవ్ మోడీ ఆస్తులని ఈడీ స్వాధీనం చేసుకుంటుంది.కొద్ది కాలం క్రితం అతి ఖరీదైన అతని విలాస భవంతిని స్వాధీనం చేసుకున్నారు.

నీరవ్ మోడీ భార్యని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది.ఇదే టైంలో నీరవ్ మోడీని అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసిన ఈడీ, సిబిఐలు లండన్లో దౌత్య కార్యాలయం నుంచి కోర్ట్ ని ఆశ్రయించినట్లు తెలుస్తుంది.

లండన్ హై కోర్ట్ కూడా నీరవ్ మోడీ అరెస్ట్ కి వారెంట్ జారీ చేసిందని సమాచారం.ఎ క్షణంలో అయిన అతనిని లండన్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube