హైదరాబాద్: హెచ్ఎండిఎ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అవినీతి ఆరోపణలు, అక్రమాస్తుల వ్యవహారంలో నిన్నటి నుంచి సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అధికారులు 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.కాగా జగన్ భార్య లక్ష్మి పోలీస్ అధికారి.
ప్రస్తుతం ఆమె అంబర్ పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు.హబ్సీగూడలోని జగన్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఒక కేజీ బంగారం, భారీ ఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్లు, నగదు గుర్తించారు.
హెచ్ఎండీఎ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్‌పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.హెచ్ఎండీఎకు సంబంధించి ఓపెన్ ప్లాట్ విషయంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర రూ.4 లక్షలు తీసుకున్నట్లు జగన్‌పై ఆరోపణలు ఉన్నాయి.అవినీతి ఆరోపణలతో పాటు అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.హబ్సిగూడలోని ఇంట్లో నిన్నటి నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.జగన్ ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు.హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.