తెలంగాణలో టీఆర్ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు అందించింది.ఈ మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
రేపు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.ఇప్పటికే మంత్రి గంగుల నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్న విషయం తెలిసిందే.
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ అరెస్ట్ పై నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.అదేవిధంగా నకిలీ అధికారి శ్రీనివాస్ తో మంత్రి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది.
తెలంగాణలో పలువురు మంత్రులు, నాయకులతో పరిచయాలు ఉన్నట్లు శ్రీనివాస్ చెబుతున్నట్లు తెలుస్తోంది.







