అమ్మ నాగేశ్వరావో ... అప్పుడే మొదలు పెట్టేశావా ...?     2018-10-24   09:48:28  IST  Sai Mallula

సీబీఐ కొత్త బాస్ గా అలా ఛార్జ్ తీసుకున్నాడో లేదో అప్పుడే పని మొదలుపెట్టేసి అందరికి షాక్ ఇచ్చాడు కొత్త డైరెక్టర్ మన్నెం నాగేశ్వరావు. విధుల్లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన రంగంలోకి దిగిపోయారు. నియామకపు ఉత్తర్వులను తెల్లవారుజామున అందుకున్న ఆయన, ఈ ఉదయం సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లి తన సిబ్బందితో తనిఖీలు ప్రారంభించారు.

Cbi New Directior Start Investigation At Our Office Chamber-

Cbi New Directior Start Investigation At Our Office Chamber

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాల ఛాంబర్లతో పాటు, వారి ప్రత్యేక సిబ్బంది గదుల్లో గంటన్నరగా తనిఖీలు జరుగుతున్నాయి. వారు వాడిన కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను, ఇతర దస్త్రాలను నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్థానా, వర్మలతో పాటు దేవేందర్ చాంబర్లలోనూ తనిఖీలు సాగుతున్నట్టు సమాచారం.