ట్రంప్ కి దిమ్మతిరిగే న్యూస్ ఇది..!!

అమెరికా అధ్యక్షుడిపై నిఘా ఏమిటి.?? అమెరికాకే అధ్యక్షుడు కదా ఎందుకు ఈ నిఘా.?? ఏమిటి ట్రంప్ ఏమి చేశారు…అనే వివరాలలోకి వెళ్తే.అమెరికాకి అధ్యక్షుడు అయినా లేదా ఎవరైనా సరే ఒక్క సారి ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ) కి అనుమానం కలిగింది అంటే ఎవరిని లెక్క చేయదు.

 Cbi Investigation On Trump Is That He Working For Russia-TeluguStop.com

అలాంటిది ఇప్పుడు ఇదే ఇన్వెస్టిగేషన్ సంస్థ ట్రంప్ పై విచారణ చేపట్టినట్టుగా న్యూయార్క్ టైం తెలిపింది.

ట్రంప్ రష్యా తరుపున పని చేస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఎఫ్‌బిఐ 2017 మే లోనే ట్రంప్ పై నిఘా పెట్టిందని ఈ పత్రిక తెలిపింది.ఇదే సమయంలో ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా జేమ్స్‌ కామేను అధ్యక్షుడు తొలగించిన వెంటనే ఈ దర్యాప్తు ఆరంభమైంది.ముఖ్యంగా ఈ దర్యాప్తులో రెండు అంశాలని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఒకటి ట్రంప్‌ కార్యకలాపాలపై నిఘా విధించడం.మరొకటి ఆయన తొలగింపులో క్రిమినల్ యాంగిల్ లో కారణం ఉందా అనే విషయాన్ని నిర్దారించుకుంటున్నారు.ట్రంప్‌ తెలిసి కాని లేదంటే తెలియక కాని అమెరికా ప్రయోజనాలకి వ్యతిరేకంగా పని చేస్తున్నారా అనేది ఈ దర్యాప్తు సారాంశం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube