డాక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేసిన సిబీఐ… కేసులో కొత్త మలుపు  

Cbi Filed Case On Doctor Sudhakar - Telugu Ap Politics,, Corona Effect, Lock Down, Tdp, Ysrcp

నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.మాస్క్ లు సమకూర్చలేదని ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో అతనిని విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం మీద తరువాత అకస్మాత్తుగా ఒక రోజు నడిరోడ్డు మీద కారు ఆపి మద్యం మత్తులో బూతుపురాణం అందుకున్నాడు.

 Cbi Filed Case On Doctor Sudhakar

ఈ సందర్భంగా పోలీసులు కాస్తా అత్యుత్సాహం చూపించి అతనిని తాళ్ళతో బంధించి అరెస్ట్ చేశారు.దానికి సంబందించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకొని ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది.

దళిత కార్డు ఉపయోగించి రాజకీయాలు ఆపాదించి రెచ్చగొట్టింది.దీంతో ఈ సుధాకర్ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది.

డాక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేసిన సిబీఐ… కేసులో కొత్త మలుపు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ కేసుని హైకోర్టు సుమోటోగా తీసుకొని ఎవరూ ఊహించని విధంగా సిబీఐ ఎంక్వయిరీకి ఆదేశించింది.

ఈ కేసుపై సిబీఐ విచారణ మొదలుపెట్టింది.

అతనిని అరెస్ట్ చేసిన పోలీసుల నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్స్ వరకు అందరిని ప్రశ్నించింది.ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

హైకోర్టు ఆదేశాలతో సుధాకర్‌ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు పోలీసులపై కేసు నమోదు చేయగా, తాజాగా డాక్టర్‌ సుధాకర్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.ఓ ప్రభుత్వ ఉద్యోగి అయివుండి ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా అసభ్యకరంగా ప్రవర్తించడం, ఓ కానిస్టేబుల్‌ మొబైల్‌ను కిందపడేయడం, స్థానికులను భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది.

అంతేకాదు 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు.వీటన్నింటిని పరిశీలించిన మీదట డాక్టర్‌ సుధాకర్‌పై కేసు నమోదు చేసింది.

లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు సెక్షన్‌ 188 నమోదైంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test