టీడీపీలోకి మాజీ జేడీ లక్ష్మినారాయణ!  

టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలబడే అవకాశం, .

Cbi Ex Jd Lakshminarayana Ready To Join Tdp-april 11,cbi,chandrababu,ex Jd Lakshminarayana,janasena,tdp,ys Jagan,ysrcp

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ గా, జగన్ కేసులపై విచారణ చేసిన వ్యక్తిగా ఏపీలో అందరికి భాగా తెలిసిన పేరు లక్ష్మినారాయణ. ఇంకా పదవీకాలం ఉండగానే స్వచ్చందంగా పదవికి రాజీనామా చేసిన లక్ష్మినారాయణ కొన్ని నెలల క్రితం ఏపీలో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి అన్ని జిల్లాలో పర్యటించి త్వరలో రాజకీయాలలోకి వస్తానని కూడా చెప్పారు. ఆ సమయంలో టీడీపీ, జనసేన పార్టీలలో చేరబోతున్నారు అంటూ ఊహాగానాలు వినిపించాయి...

టీడీపీలోకి మాజీ జేడీ లక్ష్మినారాయణ!-CBI Ex JD Lakshminarayana Ready To Join TDP

అలాగే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారు అనే మాట కూడా వినిపించింది.ఇదిలా వుంటే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఇప్పుడు కొత్త పార్టీ ఆలోచన లక్ష్మినారాయణ చేయకపోవచ్చు. అయితే రాజకీయాలో చేరాలనే అతని ఆలోచనకి ఎదో ఒక పార్టీని వేదికగా చేసుకునే అవకాశం వుందని తెలుస్తుంది ఇదిలా వుంటే తాజాగా ఆయన టీడీపీలో చేరబోతున్నారు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మంత్రి గంటా శ్రీనివాసరావు, లక్ష్మినారాయణతో మాట్లాడటం జరిగిందని, ఆయన కూడా టీడీపీలో చేరడానికి సుముఖత చూపించినట్లు సమాచారం. ఇక టీడీపీ తరుపున భీమిలి నుంచి లక్ష్మీనారాయణని ఎమ్మెల్యేగా బరిలో నిలబెట్టే అవకాశం వున్నట్లు కూడా టాక్ నడుస్తుంది.