సుశాంత్‌ హత్య కేసును చేపట్టి డ్రగ్స్‌ కేసుతో ముగించిన సీబీఐ

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య విషయమై కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ విధించిన విషయం తెలిసిందే.సిబిఐ ఎంక్వయిరీ లో సుశాంత్ మృతికి సంబంధించి పలు అనుమానాలకు సమాధానాలు లభిస్తాయి అంటూ అంతా భావించారు.

 Sushanth Case Come To End, Cbi Inquiry, Sushanth Singh Rajput, Rhea Chakraborty,-TeluguStop.com

కానీ సుశాంత్ మృతికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవని మీడియాలో వచ్చినవన్నీ పుకార్లే అంటూ సీబీఐ వారు తేల్చి చెప్పినట్లు ఒక జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.దాదాపుగా కేసు తుది దశకు సిబిఐ వారు తీసుకు వచ్చారు.

త్వరలోనే కేసును క్లోజ్ చేయబోతున్నట్లు సిబిఐ ఉన్నత అధికారుల ద్వారా సమాచారం అందుతోంది.ఇక ఈ కేసులో అధికారులు ఏం తెలుసుకున్నారు అనేది జనాలకు మరియు సినీ వర్గాల వారికి పెద్ద ప్రశ్నగా మారింది.

ఈకేసులో వారు పెద్దగా కనిపెట్టింది ఏం లేదని, సుశాంత్ ది అంతా అన్నట్లుగానే ఆత్మహత్య అని వారు కూడా నిర్ధారించారు.

సిబిఐ వారి విచారణ చాలా చప్పగా సాగింది అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.

సుశాంత్ కేసు విచారణ సందర్భంగా సిబిఐ వారు డ్రగ్స్ కేసు ని పట్టుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.కూడా ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలను స్టార్లను ప్రశ్నించారు.

అందులో అయినా పెద్ద వారిని పట్టుకుంటారా అంటే అది కూడా జరగలేదు.ప్రశ్నించి వదిలి పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి ఈ సిబిఐ ఎంక్వైరీ వల్ల రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు కాస్త ఇబ్బంది పడ్డారు తప్పితే పెద్దగా ఉపయోగం ఏమీ లేదంటూ సుశాంత్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఎంక్వైరీ విషయమై సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా పెద్దగా సంతృప్తి చెందలేదు అంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

డిప్రెషన్‌ వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని సిబిఐ వారు తుది నివేదిక ఇవ్వబోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube