అమరావతి పై అలజడి తప్పదా ? సీబీఐ ఎంట్రీకి రంగం సిద్దం ?

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ అమరావతి చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి.అమరావతి ప్రస్తావన లేకుండా, ఒక్క రోజు కూడా ఏపీ రాజకీయాలు ముందుకు నడిచే పరిస్థితి కనిపించడం లేదు.

 Cbi Enquiry On Amaravathi Issue Soon  Ap Politics, Chandrababu, Jagan, Cbi, Tdp-TeluguStop.com

గత టీడీపీ ప్రభుత్వం లో ఆ స్థాయిలో అమరావతికి  హైప్ తీసుకొచ్చారు.ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అంటూ హడావుడి చేశారు.

దేశ విదేశాలు తిరిగి  రాజధాని నమూనాలను సిద్ధం చేశారు.పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములు సేకరించి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని పెద్ద ఆర్భాటమే చేశారు.

కానీ 2019 నాటికి తెలుగుదేశం పార్టీ అమరావతి లో రాజధాని నిర్మించలేక పోయింది.కేవలం కొన్ని తాత్కాలిక బిల్డింగులు, మరికొన్ని శాశ్వత భవనాలు నిర్మించి ఊరుకుంది.

మొదటి నుంచి అమరావతి పై విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ అ రాజధాని ఉండేందుకు వీల్లేదని, మూడు రాజధానులు ప్రతిపాదనను తీసుకువచ్చారు.  దీంతో ఈ వివాదం మరింతగా ముదిరింది.

దీనిపై నానా రచ్చ జరుగుతోంది.ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని, అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీగా లబ్ధి పొందారని, ఎన్నో ఆరోపణలు చేయడమే కాక, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని విచారణకు నియమించి భారీ ఎత్తున అవినీతి జరిగినట్లుగా నిర్ధారించారు.

ఇక ఆ తర్వాత ఏపీలో భూముల వ్యవహారం తేల్చాలనే నిర్ణయంతో ఏసీబీ ద్వారా దీనిపై విచారణ మొదలుపెట్టారు.ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు కాగా, దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో కాస్త సద్దుమణిగినట్టుగా కనిపించినా, వైసీపీ ఎంపీ లు మాత్రం ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా, లోక్ సభ లో సైతం ప్రస్తావించి దీనిపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ మొదలుపెట్టారు.

అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి అమరావతి లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలు అన్నిటిని ప్రస్తావించి, సీబీఐ ని రంగంలోకి దించాలని కోరడంతో, కేంద్రం కూడా ఈ విషయంపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలాగూ ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ తెలుగుదేశం పార్టీని ఎప్పటి నుంచో టార్గెట్ చేసుకుంది.

ఇప్పుడు అమరావతి వ్యవహారం పై సీబీఐ రంగంలోకి దించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తే, టీడీపీ నాయకుల అవినీతి వ్యవహారాలు బయటకు వస్తాయని, క్రమంగా ఆ పార్టీ మరింత బలహీన పడుతుందని, ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలనే అభిప్రాయంలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.వైసిపి కోరిక మేరకు అతి త్వరలోనే సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube