జగన్ తెలివైన నిర్ణయం ! చిక్కుల్లో బీజేపీ ?

జగన్ నిర్ణయాలన్నీ ముందు చూపుతోనే  ఉంటాయి.తనను తన పరిపాలనను ఎవరూ వేలెత్తి చూపించకుండా ఉండాలనేదే జగన్ అభిప్రాయం.

 Ys Jagan Decision Cbi Enquiry On Anthervedhi Issue, Anthervedhi Chariot Issue, B-TeluguStop.com

దానికి తగ్గట్టుగానే ఆయన వ్యవహారాలు చేస్తూ ఉంటారు.ఒకవేళ అన్నివైపుల నుంచి ఆపద చుట్టుముట్టినా, జగన్ తన తెలివితేటలతో బయటపడుతూ ఉంటారు.

అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ తమపై మూకుమ్మడిగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన సంఘటన పై ఎదురుదాడి చేయడంతో పాటు, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తీరుతో జగన్ కాస్త మొదట్లో కంగారు పడ్డా, ప్రతిపక్షాలకు ముఖ్యంగా బీజేపీకి చెక్ పెట్టే విధంగా జగన్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు.

అంతర్వేది లో రథం దగ్ధమైన సంఘటనపై పెద్ద ఎత్తున బీజేపీ, జనసేన,టీడీపీలు పోరాటం చేస్తూ అనేక విమర్శలు చేస్తూ జగన్ హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

పోలీసులు చేసిన ప్రాథమిక విచారణలో రథం దగ్ధం అవ్వడానికి కారణం రథం సమీపంలోని తేనెతుట్టె నుంచి ఈగలను తరిమి వేసే క్రమంలో, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల చర్య కారణంగా, మంటలు అంటుకున్నాయి అంటూ తేల్చారు అయినా ఈ విషయంలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండడం , ఇది వైసీపీ ప్రభుత్వం చేయించింది అనే విమర్శలు చేస్తుండడంతో పాటు, వైసీపీ ప్రభుత్వాన్ని  హిందూ ద్వేషి గా  చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Telugu Cbi Enquiry, Hindus, Ycp, Ysjagan-Telugu Political News

ఒక వేళ మళ్లీ ఏపీ పోలీసులతో విచారణ చేయించినా, ప్రతిపక్షాలు అదే రకమైన విమర్శలు చేస్తాయి.అందుకే జగన్ వ్యూహాత్మకంగా రథం దగ్ధం వ్యవహారాన్ని సీబీఐ కి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.వెంటనే జగన్ ఆదేశాల మేరకు డీజీపీ సీబీఐ కి లేఖ రాయడంతో ఈ వివాదానికి తాత్కాలిక ముగింపు పలికినట్టయ్యింది.

కేంద్రం లో బీజేపీ అధికారంలో ఉండడం, సిబిఐ కేంద్ర కనుసన్నల్లో పనిచేయడం వంటి వ్యవహారాలతో ఈ దర్యాప్తులో ఫలితం ఏ విధంగా వచ్చినా వైసీపీకి ఏ ఇబ్బందీ ఉండదు.ఇక జనసేన , బీజేపీ దూకుడు కు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది అనేది జగన్ ప్లాన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube