జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన సీబీఐ కోర్టు

శుక్రవారం పార్టీగా ప్రత్యర్థుల నుంచి జగన్ అనేక విమర్శలు ఎదుర్కుంటూ వస్తున్నారు.పాదయాత్ర సమయంలోనూ జగన్ విరామం ఇచ్చి మరీ శుక్రవారం టంచన్ గా కోర్టుకి వెళ్తూ ఉండేవారు.

 Cbi Courtgrants Exemption To Cm Jagan On Personal Appearance-TeluguStop.com

ప్రస్తుతం జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉండడంతో ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని కోర్టుకు వెళ్లడం చాలా ఇబ్బందికరంగా మారింది.ఈ నేపథ్యంలో జగన్ సీబీఐ కోర్టులో అనేకసార్లు పిటిషన్ కూడా వేసాడు.

తాజాగా సీబీఐ స్పెషల్ కోర్టు సీఎం జగన్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

సీఎం హోదాలో జగన్ ఉండడంతో సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సీబీఐ వాదనతో కోర్టు గతంలో ఏకీభవించి వ్యక్తిగత మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు.

తాజాగా ఈ కేసుల విచారణలో భాగంగా సీఎం జగన్ హైదరాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరు కానవసరం లేదని న్యాయస్థానం తెలిపింది.అక్రమ ఆస్తుల ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసులో వైయస్ జగన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube