సీఎం అయితేనేంటీ మీరు రావాల్సిందే  

Cbi Court Comments On Jagan Mohan Reddy-jagan,jagan And Amaravathi Capital Issue,jagan And Cbi,jagan Had Illigal Properties

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ కోసం ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అవ్వాల్సి ఉంటుందనే విషయం తెల్సిందే.అమరావతి నుండి హైదరాబాద్‌కు ప్రతి వారం వస్తుండటం వల్ల ఏపీ ప్రభుత్వంకు చెందిన పలు పనులు ఆగిపోవడంతో పాటు, ప్రభుత్వంపై భారం పడుతుందని, అందుకే ఈ కేసులో తనను వ్యక్తిగతంతో హారు నుండి మినహాయింపు ఇవ్వాల్సిందిగా జగన్‌ పదే పదే కోర్టును కోరుతున్నాడు.

CBI Court Comments On Jagan Mohan Reddy-Jagan Jagan And Amaravathi Capital Issue Cbi Had Illigal Properties

గతంలో రెండు సార్లు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టులో జగన్‌ పిటీషన్‌ వేయడం జరిగింది.కాని వాటిని కోర్టు కొట్టి వేసింది.

నేడు మరోసారి అదే పిటీషన్‌ను వేసిన జగన్‌ తన వాదనలు వినిపించాడు.తాను ఏపీ సీఎంగా ఉన్నాను.పరిపాలన విషయమై ప్రస్తుతం చాలా బిజీగా ఉంటున్నాను.ఈ కారణాల వల్ల జగతి పబ్లికేషన్స్‌ నుండి ఒక ఉన్నతాధికారిని విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేశాడు.

అయితే మీరు సీఎం అయినా ఏమైనా కూడా కేసు తుది దశలో ఉన్న కారణంగా మీరు ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిందే అంటూ కోర్టు జగన్‌ విజ్ఞప్తిని కొట్టి పారేయడం జరిగింది.మళ్లీ వచ్చే శుక్రవారం నాడు జగన్‌ కోర్టులో హాజరు అవ్వాల్సి ఉంటుంది.

తాజా వార్తలు

Cbi Court Comments On Jagan Mohan Reddy-jagan,jagan And Amaravathi Capital Issue,jagan And Cbi,jagan Had Illigal Properties Related....