చిక్కుల్లో రఘురామ ? ఆ కేసులో సిబిఐ చార్జిషీట్ 

  గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వాన్ని అదేపనిగా విమర్శిస్తూ ఇబ్బందులు పెడుతున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై ఇప్పటికీ వైసిపి అనేక ఫిర్యాదులు చేసింది.కేంద్ర బిజెపి పెద్దలకు ఫిర్యాదు చేసింది రుణాల ఎగవేత కేసులో ఆయనపై అనేక ఫిర్యాదులు చేసింది.

 Cbi Chargesheet File On Mp Raghuram Krishnam Raju Company Raghuram Krishnam Raj-TeluguStop.com

అయినా బిజెపి పెద్దల అండదండలు ఉండడంతో రఘురామ పెద్దగా ఇబ్బందులు ఉండవని భావించడం తాజాగా ఆయన పై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయడం రాజకీయంగాను ఆసక్తికరంగా మారింది.రఘురామకృష్ణంరాజు తో పాటు 16 మందిపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది.

ముఖ్యంగా ఆర్థిక సంస్థల నుంచి కన్సర్సియం నుంచి రుణాలు తీసుకుని ఎగవేత కేసులో ఈ షార్ట్ షీట్ దాఖలు అయింది.
      తమిళనాడులోని ట్యుటి కొరిన్ లో ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇండ్ భారత్ ధర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినందుకు 2019 ఏప్రిల్ 29న సి.బి.ఐ కేసు నమోదు చేసింది.దీనిపై విచారణ చేసిన సీబీఐ ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను వెల్లడించింది. ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్ గా ఎండిగా ఉన్న రఘురామకృష్ణరాజు తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్లు అనుబంధ కంపెనీలు , చార్టెడ్ అకౌంటెంట్ లు కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై న్యూఢిల్లీలోని సిబిఐ న్యాయస్థానం శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది.
     

Telugu Cbi, Narsapuram Mp, Rebel Mp, Ysrcp-Telugu Political News

    ఈ సందర్భంగా సిపిఐ వివరాలను వెల్లడించింది. 2018 అక్టోబర్ 3న హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ, దాని డైరెక్టర్ పోయినా ఢిల్లీలో కేసు నమోదయింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబిఐ 2019, ఏప్రిల్ 29న కేసు నమోదు చేసింది.తమిళనాడులోని ట్యుటికోరిన్ లో ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం అనిచెప్పి ఆర్థిక సంస్థల కన్సర్షియం నుంచి రూ.947.71 కోట్ల గుత్తి రోడ్డు గా తీసుకున్నారు.కానీ అక్కడ ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు.

రుణంగా తీసుకున్న సొమ్ములను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించినట్లు సిబిఐ అభియోగాలు నమోదు చేసింది.ఇండ్ భారత్ పవర్ కంపెనీ చైర్మన్ రఘురాం బ్యాంకులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

దీంతో రఘురామతో పాటు 16 మంది డైరెక్టర్ల పైన సిబిఐ చార్జిషీట్ నమోదు చేసింది.అలాగే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఎంపీ రఘురామకృష్ణంరాజు కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది.

  భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పిటిషన్ ను ఎస్ సీ ఎల్ టి తిరస్కరించింది.         

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube