అఖిలేష్ పై సీబీ'ఐ' ! కక్ష తీర్చుకోబోతున్నారా ...?

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై కేంద్రం ఇప్పుడు కక్షసాధింపు చర్యలకు దిగినట్టుగా కనిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే ధ్యేయంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌వాదీ (బీఎస్సీ) పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే యూపీలో సీబీఐ తన ప్రభావం చూపించింది.

 Cbi Case File On Akhilesh Yadav-TeluguStop.com

యూపీ సీఎంగా అఖిలేష్‌ ఉన్న సమయంలో మైనింగ్‌ స్కామ్‌కు సంబంధించి ఈ రోజు 12 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది.యూపీలో మైనింగ్‌ స్కామ్‌కు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయి.2012-13లో యూపీ మైనింగ్‌ శాఖకు ఇంచార్జి మంత్రిగా అఖిలేష్‌ ఉన్నారు.అపుడు అఖిలేష్‌ తోపాటు గాయత్రి ప్రజాపతి మైనింగ్‌ శాఖను నిర్వహించారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఎస్పీ ఎమ్మెల్సీ రమేష్‌ కామత్‌ మిశ్రా, 2017లో బీఎస్పీ అభ్యర్థి సంజయ్‌ దీక్షిత్‌ తోపాటు ఐఏఎస్‌ అధికారి చంద్రలేఖతోపాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది సీబీఐ.

2017లో అయిదు ప్రిలిమినరీ ఎఫ్‌ఐఆర్‌లు సిద్ధం చేసిన సీబీఐ… ఇన్నాళ్ళూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావొచ్చని సీబీఐ అధికారులు అంటున్నారు.కొత్త ఎఫ్‌ఐఆర్లలో నేరుగా అఖిలేష్‌ను నిందితునిగా సీబీఐ చేర్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది.

ఎఫ్‌ఐఆర్‌ చివరి లైన్‌లో ‘విచారణలో భాగంగా 2012-16 మధ్య కాలంలో అప్పటి మైనింగ్‌ శాఖ మంత్రుల పాత్రపై కూడా విచారణ చేసే అవకాశముంద’ని సీబీఐ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube