America FBI : అమెరికన్ ను బ్లాక్మెయిల్ చేస్తున్న భారత యువకుడు....కట్ చేస్తే...

తప్పు చేస్తే శిక్ష అనుభవించి తీరాల్సిందే ఒకడుగు అటు ఇటు అయినా తప్పు చేస్తే దాని ఫలితం తప్పకుండా కనిపిస్తుంది.అమెరికాలో ఉంటున్న ఓ ప్రొఫెసర్ ను టార్గెట్ గా చేసుకున్న యువతి అతడిని ముగ్గులోకి దించింది, మెల్ల మెల్లగా అతడి నుంచీ కొన్ని వీడియోలు సేకరించింది.

 Cbi Arrests One For Blackmailing Us-based Economics Professor,cbi,blackmailing,u-TeluguStop.com

తన లవర్ తో కలిసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు లాగేస్తోంది.సీన్ కట్ చేస్తే ఊహించని షాక్ తగిలింది సదరు యువ జంటకు…ఇంతకీ అసలేం జరిగిందంటే.


రాహుల్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ ను బెదిరిస్తున్నట్టుగా అమెరికా పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది.అయితే బెదిరింపులకు దిగిన వ్యక్తి భారత్ లో ఉన్నాడని తెలిసుకున్న పోలీసులు ఈ కేసును అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI ) కు తరలించారు.

ఈ క్రమంలో అసలు విషయం వెల్లడయ్యింది.ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా అమెరికా ప్రొఫెసర్ తో పరిచయం పెంచుకుంది.

తన న్యూడ్ వీడియోలో పంపాలంటూ ప్రొఫెసర్ ను కోరడంతో అతడు వీడియో లు పంపాడు.ఈ క్రమంలో

Telugu Professor-Telugu NRI

తనకు, ప్రొఫెసర్ కు మధ్య ఉన్న సంభంధం తన లవర్ కు తెలిసిపోయిందని ఇద్దరి వీడియో కాల్స్ ను అతడు రికార్డ్ చేశాడని వాటితో తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ప్రొఫెసర్ ను ఆమె ట్రాప్ చేసింది.తన లవర్ డబ్బులు అడుగుతున్నాడని లేదంటే మన వీడియో లో అమెరికా న్యూస్ చానల్స్ కు ఇస్తానని అంటున్నాడని చెప్పడంతో ఆందోళన చెందిన ప్రొఫెసర్ ఆమెకు దాదాపు 48 వేల డాలర్లు డబ్బు పంపాడు.అక్కడితో ఆగకుండా ఆ ఇద్దరు ప్రేమికులు మరింత డబ్బు కావాలంటూ బ్లాక్మెయిల్ చేయడంతో అసలు విషయం భోదపడిన ప్రొఫెసర్ ఇద్దరిపై కేసు పెట్టాడు.

దాంతో రంగంలోకి దిగిన FBI భారత్ లోని CBI కు ఈ విషయం చెప్పి ఆమె ప్రేమికుడు రాహుల్ ను అరెస్ట్ చేసింది.పరారీలో ఉన్న యువతి కోసం CBI వెతుకుతోంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube