బ్యాంకులకు షాక్... కస్టమర్లకు ఆ ఛార్జీలు తిరిగివ్వాల్సిందే...!

CBDT (సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ – కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) బ్యాంక్స్ కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది.అదేమిటంటే… UPI, డిజిటల్ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కస్టమర్ల దగ్గర వసూలు చేసిన ఛార్జీలు అనగా.UPI ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) బ్యాంకులను ఆదేశించింది.UPI క్యాఆర్ కోడ్, భీమ్ UPI, రూపే సహా ఇతర డిజిటల్ విధానాలలో ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలూ చేసిన ఛార్జీలను మొత్తం తిరిగి వారికి చెల్లించాలని నిన్న అనగా.

 Cbdt Asked Banks To Refund Charges For Digital Transactions, Bhim Upi Transation-TeluguStop.com

ఆగస్టు 30న ఓ సర్క్యూలర్ రిలీజ్ చేసింది.
ఇకపోతే.

డిజిటల్ విధానాన్ని ప్రజలకు అలవాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఫైనాన్స్ యాక్ట్ 2019లో సెక్షన్ 10A ను మరియు సెక్షన్ 269 SUను ఐటీ యాక్ట్‌లో చేర్చిన విషయం అందరికీ తెలిసినదే.దీని ప్రకారం భీమ్ UPI, రూపే ఇంకా ఇతర డిజిటల్ చెల్లింపులపై కూడా ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం ఆదేశించింది.

కానీ కొన్ని బ్యాంకులు దీన్ని విస్మరించి, బాధ్యతా రాహిత్యంతో ఇంకా ఆ రకమైన విధానాల్లో డిజిటల్‌గా చెల్లించిన వారి వద్ద నుంచి ఛార్జీలు వసూలు చేస్తూనే వుంది.

Telugu Bank Customers, Banks, Bhim Upi, Cbdt, Insurance-Latest News - Telugu

ఈ చర్యను CBDT తప్పుబడుతూ పై ఉత్తర్వులను ఆయా బ్యాంకులకు జారీ చేసింది.ఈ విషయంలో ఆయా బ్యాంకులు ఎలా రియాక్ట్ అవుతాయో ఇంకా తెలియాల్సి వుంది.ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఆయా ఛార్జీలను కస్టమర్ల అకౌంట్లకు తరలించాలని కేద్రం ప్రతిపాదించింది.

అంతేకాకుండా.ప్రస్తుతం జనవరి 1 నుంచి వసూలు చేసిన ఛార్జీలు తిరిగివ్వడంతో పాటుగా భవిష్యత్‌లో కూడా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకులకు షాక్… కస్టమర్లకు ఆ ఛార్జీలు తిరిగివ్వాల్సిందే…!CBDT ఈ సందర్భంగా స్పష్టం చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube