జాగ్రత్త సుమా : ఫోన్‌పే ద్వారా నయా మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్లు..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణమైపోయింది.దీనినే ఆసరాగా చేసుకున్న కొంతమంది సైబర్ కేటుగాళ్లు టెక్నాలజీని ఉపయోగిస్తు నయా మోసాలకు పాల్పడేందుకు సిద్ధపడుతున్నారు మరోవైపు డిజిటల్ వ్యాలెట్లు  ప్రవేశపెట్టినప్పటి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా సులభతరంగా మారిపోయిందనే చెప్పాలి.

 Caution Suma: Fraudsters Committing New Scams Through Phone  Be Care Full, Phone-TeluguStop.com

ఎవరు కూడా బ్యాంకుకు వెళ్ళవలసిన పనిలేకుండా జస్ట్ ఫోన్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు సులువుగా పంపుతున్నారు.ఈ క్రమంలో మన భారతదేశంలో డిజిటల్ నాలెడ్జ్ విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది.

తాజాగా గుంటూరులో జరిగిన ఒక మోసం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.పూర్తి వివరాల్లోకి వెళితే గుంటూరు నగరానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఇటీవల తన స్నేహితుడికి ఫోన్ పే ద్వారా 400 రూపాయలు పంపించాడు ఐతే 400 రూపాయలు అతని అకౌంట్ లో కట్ అయ్యాయి.

కానీ తన ఫ్రెండ్ కు మాత్రం డబ్బులు జమ అవ్వలేదు.దీనితో వెంటనే అలర్ట్ అయిన నాగరాజు కస్టమర్ కేర్ కి కాల్ చేసి విషయాన్ని తెలియజేశాడు.

ఈ క్రమంలో  కస్టమర్ కేర్ ప్రతినిధులు వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.ఇది ఇలా ఉండగా అనుకోకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి ఫోన్ పే కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను అంటూ ఆ రూ.400 రూపాయలు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు.మొబైల్ ఫోన్ ను ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుందని అది చెప్తే ఆ డబ్బులు జమ చేస్తామని తెలపడంతో నాగరాజు ఆ మాటలు నమ్మి వెరిఫికేషన్ కోడ్ ను  తెలిపాడు.

ఇక కోడ్ తెలిపిన వెంటనే నాగరాజు బ్యాంకు  అకౌంట్ లో నుంచి 49 వేల రూపాయలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది.అయితే, వెంటనే సదరు వ్యక్తిని ఎందుకు ఆ డబ్బులు  డ్రా అయిందని నాగరాజు మరోసారి అడగగా సదరు వ్యక్తి మళ్ళి కోడ్ తెలపాలని కోరారు.ఈసారి మొత్తం డబ్బులు జమ అవుతాయి అని తెలపగా నాగరాజు వెంటనే కోడ్ ను చెప్పగానే మళ్ళి అకౌంట్ లో నుంచి రూ.48,675 కట్  అయిపోయాయి.దీనితో వెంటనే సదరు వ్యక్తికి కాల్ చేయడంతో ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.చివరకి నాగరాజు తాను మోసపోయానని గ్రహించిన వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

కేవలం 400 రూపాయల కోసం చూసుకుంటే ఏకంగా 90 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు నాగరాజు.పోలీసులు ఇలాంటి  వారి వలలో పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube