కొందరికి చెమట ఎందుకు ఎక్కువగా పడుతుంది ?  

Why Do Some People Release Excessive Sweat From The Body ?-

English Summary:Good coming out of the body sweat. Also, it is one of the ways the body can go out malinalu.But some people take excessive sweat. Sometimes even without cause.Similar to the "hyper hidrosis" is said to be the victims. It is not a healthy condition.Manalage no matter who, no matter what we do, a lot more than you have difficulty cematapadutu. What are the risk factors for this condition?

Simpatetik nervous system, the need to work beyond the main reason is due to take place.Imbyalens hormonal, genetic factors, eating habits are common reasons we know. But behind it may have some unusual factors.So, if your snehitudike this problem because, as we say, citing the horrors that once the tests tell ceyincukomani.

Also, this problem may occur if the blood sugar levels low avasaranikanna.Kulosis Royaltuber a dangerous infection can cause high cemataki. And when it comes to this issue, kevalama the perspiration is not, you may have trouble breathing, cough up blood, epileptic seizures, chest pain may be also.Another cause of lymphoma may also sweat more. The problem is, when the swelling in the stomach, difficulty in breathing may occur.Do not sweat so that the tiredness. .

శరీరంలోంచి చెమట రావడం మంచిదే. శరీరంలో ఉన్న మలీనాలు బయటకు వెళ్ళే మార్గాల్లో అది కూడా ఒకటి. కాని కొందరికి చెమట అతిగా పడుతుంది..

కొందరికి చెమట ఎందుకు ఎక్కువగా పడుతుంది ?-

ఒక్కోసారి కారణం లేకుండా కూడా. ఇలాంటి వారిని “హైపర్ హిడ్రోసిస్” బాధితులు అని అంటారు. ఇది ఆరోగ్యకరమైన కండీషన్ కాదు. వీరు మనలాగే ఉన్నా, మనం చేసే పనే చేసినా, మనకంటే చాలా ఎక్కువగా చెమటపడుతూ ఇబ్బందిపడతారు.

మరి ఈ కండిషన్ రావడానికి కారణాలు ఏంటి ?సింపాతేటిక్ నెర్వస్ సిస్టం, అవసరానికి మించి పని చేయడం వలన ఇలా జరుగుతుంది అనేది ప్రధాన కారణం. హార్మోనల్ ఇమ్బ్యాలేన్స్, జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు అనేవి మనకు తెలిసిన సాధారణ కారణాలు. కాని దీని వెనుక కొన్ని అసాధారణ కారాణాలు కూడా ఉండొచ్చు.

కాబట్టి, మీ స్నేహితుడికే గనుక ఇలాంటి సమస్య ఉంటే, మేం చెప్పే ఆ భయానక కారణాలు చూపించి ఓసారి పరీక్షలు చేయించుకోమని చెప్పండి.బ్లడ్ షుగర్ లెవెల్స్ అవసరానికన్నా తక్కువ ఉంటే కూడా ఈ సమస్య రావచ్చు. ట్యుబర్ కులోసిస్ అనే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కూడా అధిక చెమటకి కారణం కావచ్చు.

ఈ సమస్యే గనుక వస్తే, కేవలమ అధికంగా చెమట పట్టడమే కాదు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు, రక్తంతో కూడిన దగ్గు, మూర్చ, ఛాతి నొప్పి కూడా కలగవచ్చు. లింఫోమా అనే మరో కారణంతో కూడా అధికంగా చెమట పట్టవచ్చు. ఈ సమస్య వచ్చినట్లయితే పొట్ట ఉబ్బడం, శ్వాసలో ఇబ్బంది తలెత్తవచ్చు.

కాబట్టి చెమటే కదా అని అలసత్వం వద్దు.