ఈదురు గాలులకు లేచిన పశువుల పాక రేకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(n Yellareddypet ) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో ముద్దం మల్లేశం, ముద్దం శ్రీనివాస్ అనే ఇద్దరు అన్నదమ్ములకు చెందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం( Mahatma Gandhi National Rural Employment Guarantee Act ) కింద నిర్మించిన రెండు పశువుల పాకల రేకులు శనివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు లేచి కింద పడ్డాయి.

దీంతో రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

చుట్టూ పక్కల ఇండ్ల వాళ్ళు తలుపులు పెట్టుకుని పడుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.ఇద్దరు అన్నదమ్ములకు చెందిన రేకులు ఇలా ఈదురు గాలులకు లేచి పోవడం రెండో సారి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇప్పటికీ రెండు సార్లు రేకులు ఇలా ఈదురు గాలులకు పడిపోవడంతో రెండు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.నష్టపోయిన రైతులను మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పరామర్శించి వివరాలు తెలుసుకుని వీరికి నష్ట పరిహారం అందించాలని మండల తహశీల్దార్ రామచంద్రం ను,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మండల అధికారి కొమురయ్య ను కోరారు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం : కమాండెంట్ యస్.శ్రీనివాస రావు
Advertisement

Latest Rajanna Sircilla News