పిల్లులు,కుక్కల విక్రయం పై నిషేధం, చైనా లో

డ్రాగన్ దేశం చైనా లోని వూహన్ లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 203 దేశాలకు పాకి ఏకంగా 45 వేల మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ వైరస్ మొట్ట మొదటి సారిగా చైనా లో ప్రబలడం తో 3 వేలమందికి పైగా మృతి చెందగా, 81 వేలమందికి ఈ వైరస్ సోకింది.

 Shenzhen, China, Cats And Dogs, Ban, Corona Effect, Coronavirus-TeluguStop.com

అయితే ఈ క్రమంలోనే వూహన్ మరియు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ప్రకటించిన అక్కడి ప్రభుత్వం ఆ తరువాత కరోనా తగ్గుముఖం పట్టడం తో లాక్ డౌన్ ను కూడా ఎత్తివేశారు.లాక్ డౌన్ ను ఎత్తివేసిన తరువాత చైనా మార్కెట్ లలో ఎప్పటిలాగే అన్ని జంతువుల మాంసాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెగ వార్తలు కూడా వచ్చాయి.

అయితే మే 1 వ తేదీ నుంచి చైనా లోని షెన్ జెన్ సిటీ లో పిల్లులు,కుక్కలా విక్రయం పై నిషేధం విధించినట్లు తెలుస్తుంది.

ఈ కొత్త చట్టం మే 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తుంది.

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో చైనా లో కుక్కలు,పిల్లులు,బల్లులు,పాములతో పాటు రక్షిత వన్యప్రాణులను తినడాన్ని నిషేధించినట్లు తెలుస్తుంది.పెంపుడు జంతువులుగా కుక్కలు, పిల్లులు ఇతర జంతువులతో పోలిస్తే మానవులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుంటాయి.

పాములు, బల్లులు, పిల్లులు, కుక్కలతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగంపై షెన్‌జెన్‌లో నిషేధం విధించడం ఇదే తొలిసారి.కుక్కలు, పిల్లులు మరియు ఇతర పెంపుడు జంతువుల వినియోగాన్ని అభివృద్ధి చెందిన హాంగ్‌కాంగ్‌, తైవాన్‌ దేశాల్లో ఇప్పటికే నిషేధించారు.

Telugu Cats Dogs, China, Corona Effect, Coronavirus, Shenzhen-

చైనాలోని వుహాన్‌ నగరంలోని జంతువధ శాల కేంద్రంగా 2019, డిసెంబర్‌ నెలలో కరోనా వైరస్‌ ప్రబలిన విషయం తెలిసిందే.కొత్తగా రూపొందించిన చట్టం నుంచి పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలకు నిషేధం నుంచి మినహాయించినట్లు తెలుస్తుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube