పిల్లుల నుంచీ కరోనా ..? మనుషులకూ వ్యాపిస్తుందా ?

ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషులకు మాత్రమే కరోనా వైరస్ సోకుతుంది అని అంతా అనుకున్నారు.అందుకే లాక్ డౌన్ పేరుతో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితం అయిపోయి ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు.

 Discussion About Corona Comes From Cats To Peoples, Cats, Corona Virus, Covid 19-TeluguStop.com

వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ దీని భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ఒక వేళ బయటకి వెళ్లాల్సి వచ్చినా ముఖానికి మాస్క్ లు కట్టుకుని పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా భారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మరణాలు సంభవించాయి.ఇప్పటి వరకు 10 లక్షల మంది దీని ప్రభావానికి గురయ్యారు.

అలాగే దాదాపుగా 53 వేల మంది కరోనా కారణంగా మృతిచెందారు.

Telugu Beljiyam, Cats, Chaina, Corona, Covid, Dogs Hens, India Lock, Italy-Gener

ఇక విషయానికి వస్తే కరోనా వైరస్ కేవలం మనుషులకే కాకుండా జంతువులకి కూడా సోకుతుంది అనే విషయం ఇప్పుడు బయటపడుతోంది.ఇప్పటికే హంగ్ కాంగ్ లో రెండు కుక్కలకి, బెల్జియంలో ఒక పిల్లికి కరోనా సోకింది అనే సమాచారం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.ఈ నేపథ్యంలో జంతువుల నుంచి ఈ వైరస్ మనుషులకి సోకే అవకాశం ఉందా అనే విషయంలో ఇప్పటివరకు పరిశోధకులు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.

ఇటీవల బెల్జియంలో ఓ పిల్లికి, దాని యజమాని నుంచి కరోనా సోకిన నేపథ్యంలో, శాస్తవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే పిల్లుల్లో ఒకదాని నుంచి మరొక దానికి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని బయటపెట్టారు.

Telugu Beljiyam, Cats, Chaina, Corona, Covid, Dogs Hens, India Lock, Italy-Gener

దీనిలో భాగంగానే శాస్త్రవేత్తలు మూడు పిల్లుల్లో కరోనా వైరస్ ను ప్రవేశపెట్టి వాటితో ఆరోగ్యంగా ఉన్న మరో రెండు పిల్లులను కలిపి ఒకే బోనులో బందించి ఆ తరువాత ఆ పిల్లులకు పరీక్షలు నిర్వహించగా, ఓ పిల్లిలో కరోనా లక్షణాలు కనిపించాయి.దీంతో శాస్త్రవేత్తలు పిల్లు ద్వారా కరోనా విస్తరిస్తుంది అనే విషయాన్ని బయటపెట్టారు.కాకపోతే కుక్కలు, పందులు, కోళ్లు లాంటి వాటికి ఈ వైరస్ సోకే అవకాశాలు లేవని శాస్తరవేత్తలు చెబుతున్నారు.అయితే పిల్లుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకదు అనే విషయంలో క్లారిటీ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇక చైనాలో ఇప్పుడు కుక్క, పిల్లి మాంసం తినడంపై పూర్తి స్థాయిలో నిషేధం కొనసాగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube