ఇద్దరమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కేథరిన్ త్రేసా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది.ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా నిలిచాయి.
అయితే మొదటు నుండి ఈమె కేవలం రెండో హీరోయిన్ పాత్రలకే ఫిక్స్ కావడంతో కేథరిన్ కెరీర్లో మొత్తం అవే పాత్రలు వచ్చాయి.అయితే ఇటీవల ఆమెకు సరైన పాత్రలు పడటం లేదు.
దీంతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి.ఇది చూసి దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో ఈ బ్యూటీని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
దీంతో అమ్మడికి సినిమాల అవకాశాలు పూర్తిగా తగ్గాయి.ఇటు సినిమాలు లేకపోవడం, అటు వయసు మీద పడుతుండటంతో కేథరిన్ పెళ్లి గురించి అందరూ ప్రస్తావన తీసుకొస్తున్నారు.
తన ఇంటివారు కూడా తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.కాగా తనకు ప్రేమ వివాహం చేసుకోవాలని ఉన్నా, తనకు సరైనోడు దొరకలేదని, అతడు దొరికేంత వరకు తన కుటుంబ సభ్యులు ఆగుతారో లేదో అని ఆమె అంటోంది.
మరి ఈ బ్యూటీ ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.