పెళ్లికి రెడీ అవుతోన్న ఎమ్మెల్యే!  

Catherine Tresa Ready For Marriage - Telugu Balakrishna, Boyapati Srinu, Catherine Tresa, Marriage, Nbk106

ఇద్దరమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కేథరిన్ త్రేసా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా నిలిచాయి.

Catherine Tresa Ready For Marriage

అయితే మొదటు నుండి ఈమె కేవలం రెండో హీరోయిన్ పాత్రలకే ఫిక్స్ కావడంతో కేథరిన్ కెరీర్‌లో మొత్తం అవే పాత్రలు వచ్చాయి.
అయితే ఇటీవల ఆమెకు సరైన పాత్రలు పడటం లేదు.

దీంతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి.ఇది చూసి దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో ఈ బ్యూటీని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

దీంతో అమ్మడికి సినిమాల అవకాశాలు పూర్తిగా తగ్గాయి.ఇటు సినిమాలు లేకపోవడం, అటు వయసు మీద పడుతుండటంతో కేథరిన్ పెళ్లి గురించి అందరూ ప్రస్తావన తీసుకొస్తున్నారు.

తన ఇంటివారు కూడా తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
కాగా తనకు ప్రేమ వివాహం చేసుకోవాలని ఉన్నా, తనకు సరైనోడు దొరకలేదని, అతడు దొరికేంత వరకు తన కుటుంబ సభ్యులు ఆగుతారో లేదో అని ఆమె అంటోంది.

మరి ఈ బ్యూటీ ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test