లాక్ డౌన్ కారణంగా బెస్ట్ చెఫ్ గా మారిపోయిన కేథరీన్

అసలు విశ్రాంతి లేకుండా సినిమాలు, మోడలింగ్ షో, పార్టీలు అంటూ తిరిగే సెలబ్రిటీలకి లాక్ డౌన్ కారణంగా ఏకంగా మూడు నెలలు విశ్రాంతి దొరికింది.ఫాషన్ ప్రపంచంలో ఉంటూ ఎక్కువ సమయం షూటింగ్ లలో గడపడం వలన వ్యక్తిగత జీవితాన్ని సెలబ్రిటీలు కోల్పోతూ ఉంటారు.

 Catherine Tresa Learn Cooking In Lock Down, Tollywood, Lock Down, Heroines, Cele-TeluguStop.com

అయితే లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని వ్యక్తిగతం జీవితంలో తమకి ఇష్టమైన పనుల కోసం అందాల భామలు ఉపయోగించుకుంటున్నారు.చాలా మంది కథానాయికలు వారిలోని పాకశాస్త్ర నైపుణ్యం బయట పెడుతున్నారు.

తాజాగా సౌత్ హీరోయిన్ కేథరీన్ కూడా తనలోని టాలెంట్ కి పదును పెట్టింది.

తాజాగా కేథ‌రీన్ వెజిటేబుల్ స‌లాడ్ త‌యారు చేయ‌డం నేర్చుకున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.

కొత్తిమీర‌, టామాట‌, పుదీనా, ఆలివ్ ఆయిల్‌, లెమ‌న్‌జ్యూస్ మిశ్ర‌మంతో త‌యారుచేసే త‌బ్బాలేహ్ వెజిటేబుల్ స‌లాడ్ కేథ‌రీన్ ఫేవ‌రేట్ ఫుడ్ ఐట‌మ్‌ల‌లో ఒక‌టి.ఈ స‌లాడ్ త‌యారు చేసే విధానాన్ని నేర్చుకోవాల‌ని చాలా రోజులుగా అనుకుంటున్నట్లు కేథ‌రీన్ తెలిపింది.

లాక్‌డౌన్ విరామంలో ఆ క‌ల నెర‌వేరింద‌ని చెబుతోంది.బెస్ట్ చెఫ్‌గా మారిపోయాన‌ని అంటుంది.

ఈ వెజిటేబుల్ స‌లాడ్‌ను స్వ‌యంగా త‌యారు చేస్తున్న ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.మొత్తానికి హీరోయిన్ గా ఎలాగూ సినిమాలు లేకపోవడంతో తనకి ఇష్టమైన వంటకం నేర్చుకొని దానిని అందరికి పరిచయం చేసే పనిని కేథరీన్ పెట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube